సీనియర్ ఐపీఎస్ అధికారుల పోస్టింగ్ వివాదంపై పెదవి విప్పని ఏపీ డీజీపీ హరీష్ గుప్తా…

ఏపీ పోలీస్ శాఖలో పోస్టింగుల వివాదంపై స్పందించడానికి డీజీపీ హరీష్ గుప్తా నిరాకరించారు. క్యాడర్ పోస్టుల్లో నాన్ క్యాడర్ ఐపీఎస్ అధికారుల నియామకంలో డైరెక్ట్ ఐపీఎస్ అధికారుల్లో అసంతృప్తి నెలకొంది. తాజాగా ఫైర్ డీజీని పదవి నుంచి తప్పించడం చర్చనీయాంశంగా మారింది.