ఏపీ అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు - అప్లికేషన్లు ప్రారంభం, ప్రాసెస్ ఇలా

ఏపీ అటవీశాఖలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 100 ఖాళీలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్ట్ 17వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు.