తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్ - మరో 2 రోజులు భారీ వర్షాలు, ఈ ప్రాంతాలకు హెచ్చరికలు

తెలంగాణలో మరో రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు పలు జిల్లాలకు ఐఎండీ ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చు. మరోవైపు హైదరాబాద్ లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురుస్తోంది.