విశాఖకు మరో 4 కొత్త కంపెనీలు - భారీగా పెట్టుబడులు, 50 వేల ఉద్యోగావకాశాలు..!
విశాఖకు మరికొన్ని ప్రతిష్టాత్మక సంస్థలు రానున్నాయి. ఈ మేరకు 20 వేల కోట్ల పెట్టుబడులకు 9వ SIPBలో ఆమోదముద్ర పడింది. కొత్తగా ఏర్పాటు కానున్న 4 కంపెనీల ద్వారా 50 వేల మందికి ఉపాధి, ఉద్యోగాలు దక్కే అవకాశం ఉందని రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు.