ఢిల్లీలో సీఎం రేవంత్ టీమ్ - 'బీసీ రిజర్వేషన్ బిల్లు'పై మంతనాలు..!

సీఎం రేవంత్ టీమ్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. కుల గణన, బీసీ రిజర్వేషన్ల అంశంపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు పార్టీ అధినాయకత్వంతో మంతనాలు జరుపుతోంది. గురువారం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతో పాటు మరో అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమైంది.