గోదావరిలో మళ్లీ వరద ఉధృతి - భద్రాచలం వద్ద పెరుగుతున్న నీటిమట్టం, లోతట్టు ప్రాంతాలకు హెచ్చరికలు

భారీ వర్షాల నేపథ్యంలో గోదావరిలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. భద్రాచలం వద్ద ప్రస్తుత నీటిమట్టం 32.2 అడుగులకు చేరింది. పోలవరం వద్ద 8.19 మీటర్లుగా ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. వరద ఉద్ధృతి నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలకు హెచ్చరికలను జారీ చేసింది.