ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు - హైదరాబాద్ లో రూ.11 కోట్ల నగదు స్వాధీనం

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులోని వరుణ్ పురుషోత్తం (A 40) ఇచ్చిన సమాచారం ఆధారంగా.. భారీ నగదు వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ సమీపంలోని ఓ ఫార్మ్ హౌస్‌లో సిట్ అధికారులు దాడులు చేపట్టగా… రూ.11 కోట్ల నగదును సీజ్ చేశారు.