హైదరాబాద్లో ఎడతెరిపిలేని వర్షం - నిండుకుండలా జంట జలాశయాలు, మూసీ గేట్లు ఓపెన్

హైదరాబాద్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి ఆగకుండా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో నగరంలోని చాలా చోట్ల వరద నీరు ఏరులై పారుతోంది. మరోవైపు నగరంలోని జంట జలాశయాలు నిండుకుండల్లా మారిపోయాయి. వరద ఉద్ధృతి పెరగటంతో మూసీ ప్రాజెక్ట్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.