అమాంతం 85 శాతం పడిపోయిన హరి హర వీరమల్లు కలెక్షన్స్.. పవన్ కల్యాణ్ మూవీకి బహిష్కరణ సెగ.. 2 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

హరి హర వీరమల్లు బాక్సాఫీస్ కలెక్షన్స్ డే 2: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన హరి హర వీరమల్లు సినిమా వసూళ్లు శుక్రవారం అంటే రెండో రోజున బాక్సాఫీస్ వద్ద 85 శాతం వరకు పడిపోయాయి. ముస్లిం వ్యతిరేక భావాలను వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో వివాదాల్లో చిక్కుకున్న ఈ సినిమాకు బహిష్కరణ సెగ తగిలింది.