వృద్ధులైన తల్లిదండ్రులను చూసుకోవడం కోసం ఉద్యోగులు 30 రోజులు సెలవు తీసుకోవచ్చు.. తెలుసా?

వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణతో సహా వ్యక్తిగత కారణాల వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 30 రోజుల వరకు సెలవులు తీసుకోవచ్చని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (లీవ్) రూల్స్, 1972, ఉద్యోగులకు అందుబాటులో ఉన్న వివిధ సెలవు రకాలను వివరిస్తుంది.