యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీలు మృతి

యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏపీ పోలీసులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీఎస్పీలు చక్రధర్‌రావు, శాంతారావ్ ప్రాణాలు కోల్పోయారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.