‘ఆపరేషన్ సిందూర్’ పై సోమవారం లోక్ సభలో 16 గంటల పాటు ప్రత్యేక చర్చ: రిజిజు

పహల్గామ్ లో భారతీయులపై జరిగిన ఉగ్రదాడి, ఆ తర్వాత భారత సాయుధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పై లోక్ సభలో సోమవారం ప్రత్యేక చర్చ జరగనుంది. ఈ ప్రత్యేక చర్చ సుమారు 16 గంటల పాటు జరుగుతుందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.