రసెల్ బ్యాట్ తో రప్పా రప్పా.. విండీస్ బౌలింగ్ ను ఊచకోత కోసిన టిమ్ డేవిడ్.. 37 బంతుల్లోనే ఫాస్టెస్ట్ సెంచరీతో రికార్డు

ఆస్ట్రేలియా డేంజరస్ ప్లేయర్ టిమ్ డేవిడ్ అదరగొట్టాడు. వీర విధ్వంసం సృష్టించాడు. 37 బాల్స్ లోనే హండ్రెడ్ తో హిస్టరీ క్రియేట్ చేశాడు. విండీస్ ను ఉతికారేశాడు. అయితే విండీస్ ప్లేయర్ ఆండ్రీ రసెల్ బ్యాట్ తోనే డేవిడ్ ఈ మెరుపు ఇన్నింగ్స్ ఆడటం విశేషం.