హెచ్1బీ వీసాదారులకు షాక్! ఆ 60 రోజుల గ్రేస్ పీరియడ్లోనూ డిపోర్టేషన్ నోటీసులు..

అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల్లో అనేక మందికి, 60 రోజుల గ్రేస్ పీరియడ్లో డిపోర్టేషన్ నోటీసులు అందుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై యూఎస్సీఐఎస్ వెబ్సైట్లోని ఒక కీలక పేజీ ఆర్కైవ్లోకి వెళ్లింది.