అమ్మకానికి పీఎస్‌యూ బ్యాంకులు

25 October 2026 - 08:44
0 0
అమ్మకానికి పీఎస్‌యూ బ్యాంకులు
Banks
  • నాలుగు సంస్థల్లో వాటాలను విక్రయించనున్న కేంద్రం

నూఢిల్లీ, అక్టోబర్‌ 24: నరేంద్ర మోదీ సర్కార్‌ ప్రభుత్వరంగ సంస్థలను పూర్తిగా వదిలించుకోవడానికి ఎత్తుకుపైఎత్తులు వేస్తున్నది. ఇప్పటికే పలు సంస్థలను ప్రైవేట్‌ సంస్థలకు ధారాదత్తం చేసిన కేంద్రం..తాజాగా మరో నాలుగు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో వాటాను విక్రయించడానికి సిద్ధమవుతున్నది. వీటిలో సెంట్రల్‌ బ్యాంక్‌, యూకో బ్యాంక్‌తోపాటు మరో రెండు సంస్థలు ఉన్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్‌లో ఈ విషయాన్ని ప్రకటించింది.

రెండు ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడంతోపాటు ఒక జనరల్‌ బీమా సేవల సంస్థను కూడా విక్రయించబోతున్నది. బ్యాంకులు తమ వ్యక్తిగత వ్యూహాల ప్రకారం మార్కెట్‌ నుంచి నిధులను సేకరించినప్పటికీ, ప్రభుత్వం మాత్రం మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా వాటాను విక్రయించే విషయాన్ని పరిశీలిస్తున్నది.

దీంట్లోభాగంగా సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యూకో బ్యాంక్‌, పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంక్‌, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌లతో తనకున్న వాటాను 75 శాతానికి తగ్గించుకునేయోచనలో కేంద్ర సర్కార్‌ ఉన్నది. మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ మార్గదర్శకాల ప్రకారం లిైస్టెన ఏదైన ప్రభుత్వరంగ సంస్థల్లో ప్రజలు కనీసంగా 25 శాతం వాటా కలిగివుండాలి. దీంతో ఆయా సంస్థల్లో తనకున్న వాటాను తగ్గించుకుంటున్నది.

ఐడీబీఐ ఇప్పటికే

ఐడీబీఐ బ్యాంక్‌ను గత కొన్నేండ్లుగా విక్రయించాలనుకున్నప్పటికీ కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల మెజార్టీ వాటాను విదేశీ సంస్థ ఫెయిర్‌ఫాక్స్‌ ఫైనాన్షియల్‌ హోల్డింగ్స్‌ 60.72 శాతం వాటాను కొనుగోలు చేయడానికి ముందుకొచ్చింది. దీనికి మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ, ఇతర నియంత్రణ మండళ్లు అనుమతించాల్సివుంటుంది. ఈ ఒప్పందం విలువ రూ.52,878 కోట్లు.

Comments (0)

User