Water Crisis | నీటి సంక్షోభం ముదిరాక సలహాలా?.. ఎల్‌ నినో హెచ్చరికలున్నప్పుడు మొద్దునిద్ర.. ఇప్పుడు హడావుడి

26 October 2026 - 12:08
0 0
Water Crisis | నీటి సంక్షోభం ముదిరాక సలహాలా?.. ఎల్‌ నినో హెచ్చరికలున్నప్పుడు మొద్దునిద్ర.. ఇప్పుడు హడావుడి
Farmers

Water Crisis | హైదరాబాద్‌, అక్టోబర్‌ 25 (నమస్తే తెలంగాణ) : కరువు హెచ్చరికలున్నప్పుడు ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాల్సి న సమయంలో మొద్దునిద్రపోయిన ప్ర భుత్వం.. ఇప్పుడు సంక్షోభం ముదిరాక మేల్కొన్నట్టున్నది. వర్షాభావ పరిస్థితుల నుంచి రైతులు, ప్రజలను గట్టెక్కించి సా గు, తాగునీరు అందించాలని ప్రతిపక్ష నేత లు మొత్తుకున్నా, జనం రోడ్లపైకి ధర్నాలు చేసినా పట్టించుకోకపోవడంతో రాష్ట్రం ఎ న్నడూ లేనంత కరువు కోరల్లో చిక్కుకొని విలవిల్లాడింది.

సర్కార్‌ వైఫల్యంపై విమర్శలు రావడంతో పరిస్థితి అదుపు తప్పిన తర్వాత, సలహాల పేరుతో అఖిలపక్ష భేటీ అంటూ కొత్త నాటకానికి తెరతీసింది. ఈ నెల 28న సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసింది. ఎల్‌ నినో ప్రభావం, వర్షపాతం లోటు, కరువు పరిస్థితులను ఎదురొనేందుకు రాజకీయ పార్టీల నుంచి సలహాలు, సూచనలు కోరుతామని ప్రభుత్వం చెబుతున్నా, ముమ్మాటికీ తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న కంటితుడుపు చర్యేనని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు.

ప్రత్యామ్నాయం చూపడంలో విఫలం

కొన్ని నెలలుగా భూగర్భ జలాలు పడిపోయి, ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు అడుగంటుతున్నా ప్రత్యామ్నాయం చూపడంలో ప్రభుత్వం విఫలమైంది. వర్షాలు లేక పంటలు ఎండిపోయే ప్రమాదం పొంచి ఉన్నదని తెలిసినా రైతులకు తగిన మార్గదర్శకాలు ఇవ్వలేదు. విత్తనాలు, ఎరువులు, సాగునీటి నిర్వహణపై దృష్టిపెట్టకపోవడం తో ఇవాళ ప్రతి పల్లె నీటి చుక కోసం అల్లాడే దుస్థితి దాపురించింది.

నీటిని ఎత్తలేక కక్ష సాధింపులు

కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోసి చెరువులు, రిజర్వాయర్లను నింపే అవకాశం ఉన్నప్పటికీ, ప్రభుత్వం కక్షసాధింపులకే ప్రాధాన్యమిచ్చింది. కన్నెపల్లి నుంచి 750 టీఎంసీల నీటిని ఆంధ్రా పాలకుల మెప్పు కోసం వదిలేసింది. సాంకేతిక కారణాల సాకుతో కన్నెపల్లి పంపులను ఆన్‌ చేయకుండా మొండివైఖరి ప్రదర్శించింది. పాలకుల తప్పిదంతో పంటలు నెర్రె లు బారాయి, చేతికొచ్చిన పైరు కండ్లముం దే ఎండిపోయి రైతన్నలు రోదిస్తున్నారు.

విద్యుత్తు నిర్వహణలోనూ నిర్లక్ష్యం

సాగునీరే కాదు, విద్యుత్తు నిర్వహణలోనూ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. రాబోయే ఎండల తీవ్రత, వ్యవసాయానికి విద్యుత్‌ డిమాండ్‌ను ముందే అంచనా వేసి సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిని పెంచడంలో పాలకుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. బొగ్గు వెలికితీత మందగించడంతో థర్మల్‌ కేంద్రాల్లో ఉత్పత్తి పడిపోయింది. ఫలితంగా తీవ్ర కొరత ఏర్పడి, రోజూ అప్రకటిత కోతలు, లో-వోల్టేజీ స మస్యలతో వ్యవసాయ మోటర్లు కాలిపో యి రైతులు దికుతోచని స్థితిలో పడ్డారు.

అస్తవ్యస్తంగా తాగునీటి సరఫరా

పల్లె, పట్టణం అనే తేడా లేకుండా రాష్ట్రమంతటా తాగునీటి సరఫరా పూర్తిగా అస్తవ్యస్తమైంది. భూగర్భజలాలు పడిపోతున్న దశలో ముందస్తుగా మంచినీటి చెరువులను నింపడం గానీ, మిషన్‌ భగీరథ నెట్‌వర్‌ను సమాయత్తం చేయడం గానీ చేయలేదు. బిందెడు నీళ్ల కోసం గ్రామీణ ప్రాం తాల్లో కిలోమీటర్ల మేర నడువాల్సిన దుస్థి తి వచ్చింది. ప్రజలు రోడ్లెకి నిరసనలు తెలుపుతున్నా పట్టించుకోలేదు. పట్టణాల్లో అయితే తాగునీటికి అల్లాడుతున్నారు. ఇక హైదరాబాద్‌లో ట్యాంకర్ల కొనుగోలు చే యాల్సిన గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి.

చేతులెత్తేసిన రేవంత్‌ సర్కార్‌

పాలనా పగ్గాలు చేపట్టిన నాటినుంచి రాష్ట్రానికి దిశానిర్దేశం చేయాల్సిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, విపత్కర పరిస్థితుల్లో రైతులకు అండగా నిలువాల్సింది పోయి, చేతులెత్తేశారు. సంక్షోభం ముదిరి విమర్శల దాడి పెరిగేసరికి, తప్పించుకోవడానికే అఖిలపక్షం అస్త్రాన్ని ముందుకు తెచ్చారని స ర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఇప్పు డైనా మాటలకే పరిమితం కాకుండా పక్కా కార్యాచరణ సిద్ధం చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. రాజకీయ ద్వేషాలను పకనపెట్టి కాళేశ్వరం ద్వారా నీళ్లు ఎత్తిపోయాలని, కోతలకు తెరదించి నిరంతర విద్యు త్తు అందించాలని, కరువు వల్ల నష్టపోయి న ప్రతి రైతుకూ తగిన పరిహారం చెల్లించి ఆదుకోవాలని విపక్షాలు, రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

అఖిలపక్ష భేటీకి దూరంగా బీఆర్‌ఎస్‌

ప్రభుత్వం తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే అఖిలపక్షం పేరిట నాటకమాడుతున్నదని అందుకే భేటీకి దూరం గా ఉండాలని బీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. నీళ్లెత్తి పోసే అవకాశమున్నా కక్షతో కిందికి వదిలేశారని, బొగ్గు ఉత్పత్తి పర్యవేక్షణ లో పంతో విద్యుత్‌ కోతలు విధించి రైతులను నట్టేట ముంచారని ఆ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. నెలల తరబడి మొద్దునిద్ర పో యి అంతా అయిపోయాక, కంటితుడుపు ప్రభుత్వం నిర్వహించే సమావేశంలో కూ ర్చొని ప్రభుత్వం చేసే తప్పిదాలకు వంతపాడే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ బహిషరణ బాట పట్టింది.

Comments (0)

User