Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!

Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత (Congress Top Leader) రాహుల్ గాంధీ (Rahul Gandhi) కి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) రాష్ట్రం సుల్తాన్‌పూర్ (Sultanpur) జిల్లాలో పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే (Purvanchal Expressway) పై ఆయన కాన్వాయ్‌లో ప్రమాదం జరిగింది. కాన్వాయ్‌లోని ఐదు కార్లు, ఒక అంబులెన్స్ ఒకదానినొకటి ఢీకొన్నాయి. రాహుల్‌గాంధీ తనపై నమోదైన ఓ పరువునష్టం కేసు విచారణకు హాజరయ్యేందుకు సుల్తాన్‌పూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వేపై 89.5 కిలోమీటర్ల మార్కు దగ్గర హలియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పార్టీ కార్యకర్తలు, భద్రతా సిబ్బంది గాయపడ్డారు. అయితే రాహుల్‌గాంధీ ప్రయాణిస్తున్న కారు ఢీకొన్న ఐదు కార్లలో లేదని అధికారులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
Comments (0)