Bigg Boss 10 | బిగ్‌బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్.. దక్షి, షాలినిని కావాలనే ఎలిమినేట్ చేశారా?

Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు పదో సీజన్లో ఏడో వారం ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. హోస్ట్ నాగార్జున ముందుగానే సూచించినట్లుగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. తొలుత ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగా వైల్డ్ కార్డు కంటెస్టెంట్ దక్షి ఎలిమినేట్ కాగా, ఆ తర్వాత హౌస్‌లోని సభ్యుల ఓటింగ్‌తో షాలిని కూడా బయటకు వెళ్లిపోయింది. దీంతో ఈ ఇద్దరి ఎలిమినేషన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బిగ్‌బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అడుగుపెట్టిన దక్షి.. తక్కువ సమయంలోనే తనదైన ముద్ర వేస్తుందని ప్రేక్షకులు భావించారు. అయితే, ఆటలో పెద్దగా హైలైట్ కాకపోవడం, టాస్కుల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడం ఆమెకు ప్రతికూలంగా మారినట్లు కనిపిస్తోంది. ప్రేక్షకుల ఓటింగ్‌లో వెనుకబడటంతో దక్షి ప్రయాణం ఏడో వారంలోనే ముగిసింది.
ఎలిమినేషన్ తర్వాత వేదికపైకి వచ్చిన దక్షికి నాగార్జున ఓ ప్రత్యేకమైన టాస్క్ ఇచ్చారు. ఇందులో భాగంగా హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లకు ఆమె తన అభిప్రాయాలను, సలహాలను తెలియజేసింది. రోహిత్‌తో మాట్లాడుతూ.. ఆటను ఎప్పుడూ భావోద్వేగాలతో మాత్రమే కాకుండా, తెలివిగా ఆలోచిస్తూ ఆడాలని దక్షి సూచించింది. ఆటలో రాణించాలంటే మనసుతో పాటు మెదడును కూడా ఉపయోగించాలని హితవు పలికింది. అలాగే షాలిని తన ప్రవర్తన, మాటతీరుపై దృష్టి పెట్టాలని పరోక్షంగా సూచించింది. త్రిగుణ్ మాటల విషయంలోనూ దక్షి తన అభిప్రాయాన్ని వెల్లడించింది. దక్షి చేసిన ఈ వ్యాఖ్యలు హౌస్‌లోని కంటెస్టెంట్ల ఆటతీరుపై మరోసారి చర్చకు దారితీశాయి.
ఇక షాలిని ఎలిమినేషన్ మాత్రం మరింత ఆసక్తికరంగా మారింది. శనివారం ఎపిసోడ్లో జరిగిన పరిణామాలతో ఆమె తీవ్ర అసంతృప్తికి గురైనట్లు కనిపించింది. నాగార్జున కొన్ని వీడియోలను ప్రదర్శిస్తూ ఆమె ప్రవర్తనపై ప్రశ్నలు సంధించడంతో షాలిని ఇబ్బందిపడింది.ఆ సమయంలోనే తాను హౌస్ నుంచి బయటకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమె చెప్పడంతో, బిగ్‌బాస్ ఇంటి తలుపులు తెరిచారు. అయితే, వెంటనే ఆమెను బయటకు వెళ్లకుండా ఆపారు. ఆ తర్వాత ఆదివారం ఎపిసోడ్లో డబుల్ ఎలిమినేషన్లో భాగంగా రెడ్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లలో ఒకరిని ఎంపిక చేసే ప్రక్రియ చేపట్టారు. ఈ క్రమంలో హౌస్ సభ్యుల ఓటింగ్ నిర్వహించగా, ఎక్కువ మంది షాలిని బయటకు వెళ్లాలని ఓటు వేసారు. దీంతో ఆమె బిగ్‌బాస్ ఇంటి నుంచి నిష్క్రమించింది.
షాలిని ముందుగా తనంతట తానుగా వెళ్లిపోతానని చెప్పినప్పటికీ, ఆ సమయంలో ఆమెను బిగ్‌బాస్ అడ్డుకున్నారు. అయితే, ఆ తర్వాత ఓటింగ్ ప్రక్రియ ద్వారా ఆమె ఎలిమినేట్ కావడంతో సోషల్ మీడియాలో పలు చర్చలు మొదలయ్యాయి. ఆమెను కావాలనే బయటకు పంపించారా? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. సీక్రెట్ రూమ్ నుంచి తిరిగి హౌస్‌లోకి వచ్చిన షాలిని.. తన ఆటతీరును మెరుగుపరుచుకుంటుందని చాలామంది భావించారు. కానీ ఆమె ప్రవర్తన, ఇతర కంటెస్టెంట్లతో వ్యవహరించిన తీరు ప్రేక్షకుల అభిప్రాయాలపై ప్రభావం చూపినట్లు అర్ధమవుతుంది. మొత్తానికి ఏడో వారం దక్షి, షాలిని ఎలిమినేషన్‌తో బిగ్‌బాస్ హౌస్‌లో సమీకరణాలు మారనున్నాయి. రాబోయే వారాల్లో మిగిలిన కంటెస్టెంట్లు తమ ఆటతీరును ఎలా మార్చుకుంటారో చూడాలి.
Comments (0)