Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయ్‌

19 October 2026 - 22:15
0 0
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయ్‌
Hanmakonda Collector

హనుమకొండ చౌరస్తా : వెల్‌నెస్ సెంటర్‌లో వైద్య సేవలు ( Medical services ) , నిర్వహణ మెరుగ్గా ఉండాలని వైద్యులకు, సిబ్బంది కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయ్‌ ( Collector Chahatbajpai ) ఆదేశించారు. సోమవారం హనుమకొండ జీఎంహెచ్‌ ఆవరణలో ఉన్న వెల్‌నెస్ కేంద్రాన్ని ఆమె అకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా సెంటర్‌లోని డెంటల్‌, గైనిక్‌, జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, ఈఎన్టీ, ఫార్మసీ స్టోర్‌, ఫార్మసీ, ల్యాబ్‌, తదితర విభాగాలను పరిశీలించి , పేషంట్లకు అందుతున్న వైద్య సేవలను మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సుస్మితను అడిగి తెలుసుకున్నారు. ఆయా విభాగాలలో ఓపి చూస్తున్న వైద్యులతో ఆమె మాట్లాడారు. ఓపి సేవల నిమిత్తం వస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని డాక్టర్‌ సుస్మిత వివరించారు.

వైద్యులు, సిబ్బంది హాజరు పట్టికను కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఓపి సేవల కోసం వచ్చిన పేషంట్ల వివరాలు నమోదు చేస్తున్న విధానం, ఫార్మసీలో పేషెంట్లకు మందులను ఏ విధంగా అందిస్తున్నారనేది కలెక్టర్‌ పరిశీలించారు. వైద్య సేవల నిమిత్తం అక్కడ ఉన్న పేషంట్లతో మాట్లాడారు. మందులు తీసుకునేటప్పుడు జాప్యం జరుగుతుందని, ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తుందని పేషంట్లు ఫిర్యాదు చేశారు.

Comments (0)

User