Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య

ఆదిలాబాద్ : ఒక వైపు వర్షాభావ పరిస్థితులు , మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యంతో అన్నదాతలు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఆదిలాబాద్ ( Adilabad ) జిల్లా బోరజ్ మండలం గూడ కు చెందిన పధానే రవి (52) అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ( Suicide ) పాల్పడ్డాడు. తనకున్న సొంత భూమి నాలుగు ఎకరాలతో పాటు మరో ఎనిమిది ఎకరాలు కౌలుకు తీసుకొని పంటలు సాగు చేస్తున్నాడు.
వర్షాభావ పరిస్థితుల కారణంగా పంట దిగుబడులు రాకపోగా తీవ్ర మనస్థాపనతో రెండు రోజుల కిందట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments (0)