IKP Centers | ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

6 November 2026 - 19:30
0 0
IKP Centers | ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
Ikp Centres

రాయపోల్ : ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు ( IKP Centers ) ధాన్యం తరలించి గిట్టుబాటు ధర పొందాలని సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామ సర్పంచ్ రేణుక రాజా గౌడ్ అన్నారు. శుక్రవారం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం  కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ఎంతో కష్టపడి పండించిన పంటలను దళారులకు విక్రయించకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలకు తరలించి గిట్టుబాటు ధర పొందాలని సూచించారు.

దళారుల మాయమాటలు నమ్మి రైతులు మోసపోవద్దని పేర్కొన్నారు. ఐకేపీ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే వర్షాలు లేక రైతులకు పంట నష్టం జరిగిందని. ఉన్న పంట కొనుగోలు కేంద్రం వద్ద తరలించిన రైతులకు ఇబ్బందులు కలిగించవద్దన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మరియాల స్వామి, ఐకేపీ ఏపీఎం యాదగిరి, సీసీ నాగరాజు, వార్డు సభ్యులు కరుణాకర్ , సునంద, నర్సింలు, నాయకులు తప్పెట సుధాకర్ , రైతులు పాల్గొన్నారు.

Comments (0)

User