RK Roja Protest : మళ్లీ కౌంటింగ్ నిర్వహించాలి.. కౌంటింగ్ కేంద్రం ముందు రోజా ధర్నా!
చిత్తూరు జిల్లా విజయపురం మండలం ఇల్లత్తూరు ఎంపీటీసీ ఎన్నికల లెక్కింపుపై నగరి డిగ్రీ కాలేజ్ వద్ద మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర ఆందోళన చేపట్టారు. మొదట వైసీపీ అభ్యర్థి 10 ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్లు ప్రకటించారని, అయితే రీకౌంటింగ్లో టీడీపీ 3 ఓట్లతో గెలిచినట్లు అధికారులు అక్రమంగా ప్రకటించారని రోజా ఆరోపించారు. మళ్లీ రీకౌంటింగ్ చేయాలని డిమాండ్ చేస్తూ కంటతడి పెట్టుకున్నారు. రీకౌంటింగ్ సమయంలో వైసీపీ అభ్యర్థిని పోలీసులు బయటకు నెట్టేశారని మండిపడుతూ పోలీసులు, అధికారుల తీరుకు నిరసనగా ఆమె రోడ్డుపై ధర్నాకు దిగారు.
Comments (0)