లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

నల్లగొండ, నవంబర్ 07 : వివిధ అనారోగ్య సమస్యలతో పలు ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందిన 60 మంది నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిది (CMRF) పథకం ద్వారా మంజూరు అయిన రూ.33,55,500 /- విలువ గల చెక్కులను శనివారం నల్లగొండ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం వల్ల నిరుపేదలకు లబ్ది చేకూరుతుందన్నారు. ఈ పథకం ద్వారా లక్షలాది మంది పేదలకు సహాయం అందుతుందన్నారు. నిరుపేద ప్రజలకు సహాయాన్ని అందించడం సంతోషంగా ఉందన్నారు.
Comments (0)