సర్’పై ఆరోపణలు నిరాధారం

- ఓట్లు తొలగించినట్టు ఆధారాలేమైనా ఉంటే చూపాలి
- సీఎం రేవంత్‌కు బీజేపీ చీఫ్ రామచందర్‌రావు సవాల్
హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో చేపట్టిన ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్‌రావు మండిపడ్డారు.
శనివారం బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, మహిళల ఓట్లను బీజేపీ ఉద్దేశపూర్వకంగా తొలగిస్తున్నదంటూ ముఖ్యమ ంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.
“సర్’ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజల్లో ఎండగట్టేందుకు బీజేపీ సిద్ధమైందని, ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి-అరాచకానికి వ్యతిరేకంగా పోరాడండి’ అనే నినాదంతో నవంబర్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలు చేపట్టనున్నామని తెలిపారు.
Comments (0)