ఇన్ఫీ హైదరాబాద్‌ జీసీసీ విస్తరణ

25 October 2026 - 08:44
0 0
ఇన్ఫీ హైదరాబాద్‌ జీసీసీ విస్తరణ
Infosys

హైదరాబాద్‌, అక్టోబర్‌ 24: దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌..హైదరాబాద్‌లో ఉన్న ఏఐ-గ్లోబల్‌ కెపాబిలిటీ సెంటర్‌(జీసీసీ)ని మరింత విస్తరించబోతున్నట్టు ప్రకటించింది. అమెరికా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కంపెనీ ట్రూయిస్ట్‌తో కలిసి ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌లో ఉద్యోగుల సంఖ్యను వెయ్యికి పైగా పెంచబోతున్నది.

ప్రధానంగా ఏఐ, టెక్నాలజీ, డాటా, బ్యాంకింగ్‌ సేవలను మరింత విసృ్త పరుచాలనే ఉద్దేశంతో నెలకొల్పిన ఈ సెంటర్‌ను ఇన్నోవేషన్‌, డిజిటల్‌ బ్యాంకింగ్‌ సర్వీసుల హబ్‌గా తీర్చిదిద్దనున్నట్టు కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ దెన్నిస్‌ గద తెలిపారు.

Comments (0)

User