Weather News: అక్కడ నదుల ఉగ్రరూపం.. ఇక్కడ చుక్క నీరు లేక రైతన్న విలవిల! ఇదేం దిక్కుమాలిన వాతావరణం రా బాబు!
Weather News: దేశవ్యాప్తంగా రుతుపవనాల తీరు తీవ్ర అసమతుల్యతను ప్రదర్శిస్తోంది. ఒకవైపు ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాలు ఎడతెరిపిలేని భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో అతలాకుతలమవుతుంటే.. మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం వర్షాలు మొహం చాటేసి తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వాతావరణంలో చోటుచేసుకున్న ఈ విచిత్ర పరిణామం అటు ఉత్తరాదిని ముంచెత్తుతూ, ఇటు దక్షిణాది రైతాంగాన్ని కరవు భయంతో వణికిస్తోంది.
Comments (0)