Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందిన‌ట్లు సోష‌ల్ మీడియాలో ఫేక్ పోస్టు

19 October 2026 - 22:15
0 0
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందిన‌ట్లు సోష‌ల్ మీడియాలో ఫేక్ పోస్టు
Afridi

న్యూఢిల్లీ: పాకిస్థాన్ మాజీ కెప్టెన్‌, క్రికెట‌ర్ షాహిద్ అప్రిది(Shahid Afridi) మృతిచెందిన‌ట్లు సోష‌ల్ మీడియాలో ఓ ఫేక్ పోస్టు వైర‌ల్ అయ్యింది. దీంతో సోష‌ల్ మీడియాలో దుమారం చెల‌రేగింది. గ‌తంలో 2005 జూన్‌లోనూ ఇదే త‌ర‌హా ఫేక్ న్యూస్ వ్యాపించింది. క్రికెట‌ర్ అఫ్రిది మ‌ర‌ణించిన‌ట్లు సోష‌ల్ మీడియాలో ఓ నివాళి పోస్ట‌ర్ వైర‌ల్ కావ‌డంతో తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అయితే ఆ పోస్టు వాస్త‌వం కాదు అని మ‌రికొంద‌రు ఎక్స్ అకౌంట్ల‌లో రియాక్ట్ అయ్యారు. క‌రాచీలో జ‌రిగిన త‌మ ఫౌండేష‌న్ ఓపెనింగ్ సెర్మ‌నీలో షాహిద్ అఫ్రిది పాల్గొన్న‌ట్లు తెలుస్తోంది. డెత్ రూమ‌ర్‌ను కొంద‌రు నెటిజ‌న్లు కొట్టిపారేశారు. త‌ప్పుడు స‌మాచారం షేర్ చేసిన ఆ అకౌంట్ హోల్డ‌ర్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కొంద‌రు డిమాండ్ చేశారు. మ‌రీ హీన స్థాయిలో జ‌నం ప్ర‌వ‌ర్తిస్తున్న‌ట్లు కొంద‌రు ఆరోపించారు. అఫ్రిది బ్ర‌తికే ఉన్నార‌ని, ఇది ప్యూర్లీ ఫేక్ న్యూస్ అని మ‌రొక‌రు పేర్కొన్నారు. ఎక్స్‌కు చెందిన ఏఐ చాట్‌బాట్ గ్రోక్‌లోనూ ఫ్యాక్ట్ చెకింగ్ చేశారు. అయితే అది ఫేక్ న్యూస్ అని, షాహిద్ అఫ్రిది స‌జీవంగా ఉన్న‌ట్లు గ్రోక్ చెప్పింది. ఫేక్ పోస్టును డిలీట్ చేయాల‌ని కొంద‌రు నెటిజ‌న్లు డిమాండ్ చేశారు.

Comments (0)

User