Road accident | భ‌వానీ భ‌క్తుల‌తో వెళ్తున్న బొలెరో బోల్తా.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం

19 October 2026 - 22:15
0 0
Road accident | భ‌వానీ భ‌క్తుల‌తో వెళ్తున్న బొలెరో బోల్తా.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం
Road Accident

Road accident : అల్లూరి జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. భవాని భక్తులతో వెళుతున్న బొలెరో వ్యాన్ కొండను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్ర‌మాదంలో ఇద్దరు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. మ‌రో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో వ్యాన్‌లో 25 మంది ఉన్నట్లు సమాచారం.

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మాడుగుల ఆసుపత్రికి తరలించారు. అనకాపల్లి జిల్లా జుత్తాడకు చెందిన భవాని భక్తులు పాడేరు అమ్మవారిని దర్శించుకుని తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

Comments (0)

User