‘యువత చెడు మార్గాలను వదిలి భక్తి మార్గంలో నడవాలి’

19 October 2026 - 22:15
0 0
‘యువత చెడు మార్గాలను వదిలి భక్తి మార్గంలో నడవాలి’
'యువత చెడు మార్గాలను వదిలి భక్తి మార్గంలో నడవాలి'

– 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ

రుద్రంపూర్, అక్టోబర్ 19 : యువత చెడును విడనాడి భక్తి మార్గంలో పయనించడం ద్వారా అన్నదాన కార్యక్రమాలు విజయవంతం అవుతున్నాయని 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ అన్నారు. సోమవారం లక్ష్మీ టాకీస్ ఏరియా, ఉన్నందాస్ గడ్డలో బస్తీ యూత్, పెద్దలు మహిళల ఆధ్వర్యంలో అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి హోమ పూజా నిర్వహించారు. ఇందులో భాగంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ పద్మ హాజరై మాట్లాడారు. యూత్, పెద్దలు, మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో కుల మాతాలకతీతంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం గర్వించదగ్గ విషయమన్నారు. యువత పెడదారిని పట్టకుండా భక్తి మార్గాన్ని అనుసరించి తోటి వారికి సహాయపడే విధంగా జీవనం కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు చెనిగరపు నరేష్, జిత్తుక దిలీప్, శ్రీకాంత్, కడలి మహేష్, రాజేశ్వరావు, అశోక్, లగ్గాల వంశీ, రాజు, మణి, సదానందం, సునీత, సౌమ్యశ్రీ అనసూయ పాల్గొన్నారు.

Comments (0)

User