Rice Millers | రైస్ మిల్లర్లపై సీఐడీ పంజా.. సీఎమ్మార్ అక్రమాల నేపథ్యంలో రంగంలోకి.. నలుగురు అరెస్టు

26 October 2026 - 12:08
0 0
Rice Millers | రైస్ మిల్లర్లపై సీఐడీ పంజా.. సీఎమ్మార్ అక్రమాల నేపథ్యంలో రంగంలోకి.. నలుగురు అరెస్టు
Rice Millers Cid

Rice Millers | రా రైస్ మిల్లర్లపై సీఐడీ పంజా విసిరింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో హుజూరాబాద్ డివిజన్ పరిధిలో రంగంలోకి దిగింది. ప్రభుత్వానికి సంబంధించిన ధాన్యాన్ని పక్కదారి పట్టించడం.. సన్న బియ్యాన్ని అమ్ము కొని సొమ్ము చేసుకోవడం.. ఎఫ్సీఐకి లెవీగా గ్రేడ్ ‘ఏ’ రకం బియ్యానికి బదులు కామన్ వెరైటీని పెట్టడం.. లాంటి అక్రమాలు జరిగినట్టు ఇప్పటికే గుర్తించగా, ఆదివారం తెల్లవారుజామున హుజూరాబాద్లో ఒక్కరు, జమ్మి కుంటలో ముగ్గురు మిల్లర్లను అదుపులోకి తీసుకున్నది. వీరిని కరీంనగర్ జిల్లాకేంద్రంలోని కార్యాలయానికి తరలించి విచారణ చేస్తున్నట్టు తెలి యగా, మిల్లర్లలో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే మిల్లర్లను కేసుల నుంచి తప్పించేందుకు అసోసియేషన్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.

జమ్మికుంట, అక్టోబర్ 25 : ప్రభుత్వ రంగసంస్థ కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు పంపిస్తే పక్కదారి పట్టించడం, లెవీగా పెట్టాల్సిన సన్న బియ్యాన్ని అమ్ముకోవడం, ఆ సొమ్మును ఇతర వ్యాపారాలకు మళ్లించి కోట్లు గడించడం, తనిఖీలకు వచ్చే అధికారులను మేనేజ్ చేయడం, ఎఫ్ సీఐకి గ్రేడ్ ‘ఏ’ రకం కాకుండా కామన్ వెరైటీని పెట్టడం.. వంటి ఆరోప ణలు మిల్లుల యజమానులపై వెల్లువెత్తగా ఉన్నతాధికారులు సీరియస్ తీసుకున్నారు. ఈ క్రమంలో అక్రమాలను బహిర్గతం చేసేందుకు సివిల్ సప్లయి కమిషనర్ తనిఖీలకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో పది రోజుల క్రితం రాష్ట్ర విజిలెన్స్ (టాస్క్ ఫోర్స్) అధికారుల బృందం రంగంలోకి దిగింది. ఈ నెల 14న హుజూరాబాద్, జమ్మికుంటలోని మిల్లుల్లో తని ఖీలు చేసింది. అయితే తనిఖీలకు వచ్చిన అధికారులు జమ్మికుంటలోని మిల్లర్లతో కలిసి తాగి తందనాలాడినట్టు తెలిసింది.

ఓ బడా మిల్లర్.. అధికారులకు లాడ్జిలో బస, విందు ఏర్పాటు చేసినట్టు ఆరోపణలు వెల్లువె త్తగా, దీనిపై ‘తనిఖీలకొచ్చి.. తాగి తందనాలాడి’ శీర్షికన 15న ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితమైంది. ఇది రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపగా.. ఉన్నతాధికారులు మరింత సీరియస్ గా తీసుకొని వెంటనే సీఐడీని రంగంలోకి దింపినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం తెల్లవారు జామున హుజూరాబాద్ డివిజన్లో హుజూరాబాద్లో ఒకరిని, జమ్మికుం టలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అందులో హుజూరాబాద్ లో కల్లూరి కృష్ణమూర్తి(వరలక్ష్మి), జమ్మికుంటలో వొల్లాల మల్లికార్జున్ (అన్న పూర్ణ), యాంసాని సంపత్ కుమార్ (లక్ష్మీసాయి), లెంకలపెల్లి మధుసూద న్(కారుణ్య) ఉన్నారు. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే కాకుండా.. నిజా మాబాద్, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, ములుగు, హైదరా బాద్ ఇలా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు పదిమందికిపైనే మిల్లుల యజమానులను అదుపులోకి తీసుకు న్నట్టు సమాచారం. వీరిని జిల్లాకేంద్రాల్లోని కార్యాలయాలకు తరలించి ఉన్నతాధికారులు విచారిస్తు న్నట్లు తెలిసింది. అయితే జిల్లాలో నలుగురు రా రైస్ మిల్లర్లను అదుపు లోకి తీసుకోవడం కలకలం రేపింది. దీంతో జిల్లాలోని మిల్లర్లంతా ఒక్క సారిగా ఉలిక్కిపడ్డారు.

విషయం తెలిసిన వెంటనే మిల్లర్ల అసోసియేషన్ బాధ్యులు, సభ్యులంతా సంఘం కార్యాలయానికి పరుగులు తీశారు. అదుపులోకి తీసుకున్న మిల్లర్లను విడిపించడంతోపాటు కేసులను నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తున్నది. అమా త్యులకు, ఉన్నతాధికారులకు ఫోన్లు చేసి కాపాడాలని వేడుకుంటున్నట్టు తెలిసింది. ఇక, అదుపులోకి తీసుకున్న మిల్లర్లకు సంబంధించిన పూర్తి వివరాలను హైదరాబాద్ సీఐడీ కార్యాలయానికి తరలించిన తర్వాత వెల్లడించే అవకాశమున్నట్టు సమాచారం. అయితే మిల్లర్లను సొంత పూచీకత్తుపై విడుదల చేస్తారా..? అరెస్ట్ చూపి రిమాండుకు తరలి స్తారా..? నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గుతారా..? ఏం చేస్తారన్నది వేచి చూడాలి. ఏదేమైనా అక్రమార్కుల అరెస్టులతో మిల్లర్లలో టెన్షన్ వాతావరణ నెలకొంది.

ఇదిలా ఉంటే.. ప్రభుత్వానికి చెందిన ధాన్యం బకాయి ఉన్న మాట నిజమేనని, మరా డించిన బియ్యాన్ని ఎఫ్సీఐకి లెవీగా గ్రేడ్ ‘ఏ’ రకానికి బదులు కామన్ వెరైటీ బియ్యాన్ని పెట్టాలని ప్రభు త్వమే ఆదేశాలిచ్చిందని మిల్లర్ల సంఘం బాధ్యులు చెప్పుకొచ్చారు. గ్రేడ్-కామన్ రకా నికి లెవీ బియ్యానికి సంబంధించిన వ్యత్యా సాన్ని కూడా డబ్బుల రూపంలో ప్రభు త్వానికి చెల్లించామని తెలిపారు. దీన్ని అధికారులు ధ్రువీకరించాల్సి ఉన్నది.

Comments (0)

User