Random Trees | కేటీఆర్‌ స్ఫూర్తితో.. ర్యాండమ్‌ ట్రీస్‌.. అమెరికాలో ప్రారంభమై, పలు దేశాలకు సేవలందిస్తున్న కంపెనీ

25 October 2026 - 08:44
0 0
Random Trees | కేటీఆర్‌ స్ఫూర్తితో.. ర్యాండమ్‌ ట్రీస్‌.. అమెరికాలో ప్రారంభమై, పలు దేశాలకు సేవలందిస్తున్న కంపెనీ
Ktr

 

Random Trees | ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)ను ఉద్యోగాలు హరించే భూతంలా కాకుండా, కొత్త అవకాశాలను సృష్టించే సాంకేతిక పరిజ్ఞానంగా చూడాలి. మార్పులను అడ్డుకోవడం కంటే వాటికి అనుగుణంగా మారడమే అభివృద్ధికి సోపానం. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనే ఆందోళనతో ఆగిపోకుండా, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? ప్రపంచ పోటీలో ఎలా ముందుండాలి? అనే అంశాలపై యువత దృష్టి సారించాలి.

-హైదరాబాద్‌లో ‘ర్యాండమ్‌ ట్రీస్‌’ దేశ ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవంలో కేటీఆర్‌

హైదరాబాద్‌, అక్టోబర్‌ 24 (నమస్తే తెలంగాణ): కేటీఆర్‌.. లోకల్‌ నుంచి గ్లోబల్‌ స్థాయికి ఎదిగిన లీడర్‌. ఆయన మాట్లాడితే కంపెనీలు తెలంగాణకు వరుస కడుతాయని అందరికీ తెలిసిందే. అది నిరూపితమైంది కూడా. కానీ ఆయన మాటల స్ఫూర్తితో అమెరికాలో ఏకంగా ఒక కంపెనీ పురుడుపోసుకున్నది. అది కూడా లోకల్‌ స్థాయి నుంచి గ్లోబల్‌ స్థాయికి ఎదుగుతున్నది. అంతేకాదు.. భారత దేశ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేసింది. కేటీఆర్‌ ప్రసంగం స్ఫూర్తితో ఏర్పాటైన ఆ కంపెనీ పేరు ‘ర్యాండమ్‌ ట్రీస్‌’. ఆ సంస్థ సీఈవో ప్రవీణ్‌ కోల. ప్రపంచ ప్రఖ్యాత యాపిల్‌ సంస్థ 2016 మే 19న హైదరాబాద్‌లో మ్యాపింగ్‌ సెంటర్‌ ఏర్పా టు చేసింది.

నాటి ఆ సంస్థ సీఈవో టిమ్‌ కుక్‌, సీఎం కేసీఆర్‌ దాన్ని ప్రారంభించారు. ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్‌ చొరవ తీసుకోవడంతో యాపి ల్‌ తెలంగాణకు తరలివచ్చింది. నాడు కేటీఆర్‌ చే సిన ప్రసంగం ప్రవీణ్‌ కోలను ప్రభావితం చేసిం ది. ఆ మాటల స్ఫూర్తితో 2017 లో అమెరికాలో ని టెక్సాస్‌లో ‘ర్యాండమ్‌ ట్రీస్‌’ను ప్రారంభించా రు. అంతర్జాతీయ విస్తరణలో భాగంగా ర్యాండమ్‌ ట్రీస్‌ తన ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌ లో ఏర్పాటు చేసింది. దీన్ని శనివారం బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రారంభించారు.

ఏఐతో ఆందోళన వద్దు: కేటీఆర్‌

ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ను (ఏఐ) ఉద్యోగాలు హరించే భూతంలా కాకుండా, కొత్త అవకాశాలను సృష్టించే సాంకేతిక పరిజ్ఞానంగా చూడాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ర్యాండమ్‌ ట్రీస్‌ సంస్థ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ప్రతి సాంకేతిక విప్లవానికి ముందు కొన్ని భయాలు, సందేహాలను సృ ష్టించినా, కాలక్రమేణా కొత్త రంగాలకు, ఉపాధి అవకాశాలకు మార్గం సుగమం చేసిందని చెప్పా రు. గతంలో బ్యాంకింగ్‌ రంగంలో కంప్యూటర్ల ప్రవేశాన్ని వ్యతిరేకించిన విషయాన్ని గుర్తుచేశారు.

మార్పులను అడ్డుకోవడం కంటే వాటికి అనుగుణంగా మారడమే అభివృద్ధికి సోపానమని పేర్కొన్నారు. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనే ఆందోళనతో ఆగిపోకుండా, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? ప్రపంచ పోటీలో ఎలా ముందుండాలి? అనే అంశాలపై యువత దృష్టి సారించాలని సూచించారు. సిల్లింగ్‌, అప్‌ సిల్లింగ్‌, రీసిల్లింగ్‌తోపాటు కొత్త విషయాలు నేర్చుకోవడం, అవసరమైనప్పుడు పాత పద్ధతులను వదిలి కొత్త విధానాలు స్వీకరించడం నేటి ఉద్యోగ ప్రపంచంలో కీలకమని చెప్పారు. ఏఐని ‘భూతం’గా అభివర్ణిస్తూ ప్రజల్లో భయాలు కలిగించడం సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు. సాంకేతిక మార్పులను అర్థం చేసుకొని, వాటిని ఉపయోగించుకునేలా ప్రభుత్వాలు విధానాలను రూపొందించాలని సూచించారు.

ఉపాధి కల్పనలో ‘ప్రైవేట్‌’దే కీలక పాత్ర

అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని, ప్రైవేట్‌ రంగం అభివృద్ధి చెందేలా అవసరమైన పరిస్థితులను సృష్టించడం ముఖ్యమని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. పెట్టుబడులు పెట్టే సంస్థలకు అనవసరమైన అడ్డంకులు లేకుండా చూడటం, వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా మరిన్ని ఉద్యోగాల సృష్టికి అవకాశం ఉంటుందని వివరించారు. మంచి రహదారులు, నిరంతర విద్యుత్తు, నీటి సరఫరా, మెరుగైన రవాణా, శాంతిభద్రతలు, నాణ్యమైన పట్టణ మౌలిక సదుపాయాలు పెట్టుబడులను ఆకర్షించడంలో కీలకమని పేరొన్నారు. పరిశ్రమలు ప్రశాంతంగా పనిచేసే వాతావరణాన్ని కల్పించడంతో పాటు, సంస్థలు విస్తరించేందుకు ప్రభుత్వాలు సహకరించాలని సూచించారు.

సాంకేతికతతో సేవల్లో నాణ్యత

సిరిసిల్లలో తాము చేపట్టిన ‘సాగు-బాగు’ కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ.. వ్యవసాయ రంగం లో సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రైతులకు ప్రత్యక్షంగా ప్రయోజనం కల్పించవచ్చని కేటీఆర్‌ వివరించారు. పంటలకు సోకే చీడపీడలను ఫొటోల ద్వారా గుర్తించి, వాటి నివారణకు అవసరమైన సూచనలు అందించే పరిషారాలను ప్రయోగాత్మకంగా వినియోగించినట్టు తెలిపారు. ఇదే తరహాలో వైద్యం, విద్య, వ్యవసాయం, పరిశ్రమ లు, ప్రభుత్వ సేవల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా సేవల నాణ్యతను పెంచవచ్చని పేరొన్నారు.

సాంకేతికత సామాన్యులకు కూడా అందుబాటులోకి రావాలని అభిప్రాయపడ్డారు. స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్‌ వంటి డిజిటల్‌ వేదికలు కొత్త వ్యాపార నమూనాలకు, ఉపాధి అవకాశాలకు మార్గం సుగమం చేశాయని పేరొన్నారు. ఇదే విధంగా ఏఐ ఆధారిత స్టార్టప్‌లు, సాంకేతిక సంస్థలు భవిష్యత్తులో కొత్త ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉన్నదని తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించడం, ఆవిషరణలను ప్రోత్సహించడం, యువతను భవిష్యత్తు ఉద్యోగాలకు సిద్ధం చేయడం ద్వారా సాంకేతిక ప్రగతిని ముందుకు తీసుకెళ్లవచ్చని అభిప్రాయపడ్డారు.

కేటీఆర్‌.. క్రేజ్‌

గతంలో ఐటీ శాఖ మంత్రిగా అనేక కంపెనీలను హైదరాబాద్‌కు తేవడంలో ఘనత చాటిన కేటీఆర్‌కు ప్రతిపక్షంలో ఉన్నా అదే క్రేజ్‌ ఉన్నది. ర్యాండమ్‌ ట్రీస్‌ సంస్థ ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవమే ఇందుకు నిదర్శనంగా నిలిచింది. వాస్తవానికి అధికార పక్షంలో ఉన్న ముఖ్యమంత్రితోనో, సంబంధిత శాఖ మంత్రితోనో ఇలాంటి సంస్థలు అంకురార్పణ చేస్తాయి.

కానీ ఇందుకు విరుద్ధంగా ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్‌తో ఓపెనింగ్‌ చేయించడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్‌ మీడియాలో కేటీఆర్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘హైదరాబాద్‌ను గ్లోబల్‌ ఐటీ హబ్‌ నుంచి గ్లోబల్‌ ఏఐ హబ్‌గా మారుస్తున్నారు.. మీ విజన్‌ పట్ల గర్వంగా ఉన్నది’.. ‘బీఆర్‌ఎస్‌ హయాంలో తీసుకొచ్చిన ఎకో సిస్టమ్‌తోనే ఐటీతో పాటు ఏఐ రంగంలోనూ హైదరాబాద్‌ దూసుకెళ్తున్నది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ర్యాండమ్‌ ట్రీస్‌ నేపథ్యం ఇదీ

ర్యాండమ్‌ ట్రీస్‌ సంస్థను ప్రవీణ్‌ కోల 2017లో టెక్సాస్‌లోని హోస్టన్‌లో ప్రారంభించారు. డాటా, ఏఐతో బిజినెస్‌ ప్రాబ్లమ్స్‌ను పరిష్కరించడంలో ఈ సంస్థ పేరుగాంచింది. ప్రపంచ వ్యాప్తంగా 700 మందికి పైగా ఉద్యోగులు ర్యాండమ్‌ ట్రీస్‌లో పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లో సుమారు 400 మంది ఉన్నారు. ఈ సంస్థకు పదికి పైగా ఏఐ పేటెంట్స్‌, 300కు పైగా ఏఐ సొల్యూషన్స్‌ ఉన్నాయి. ఫార్మా, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, యుటిలిటీస్‌, హై టెక్‌ రంగాల్లో ర్యాండమ్‌ ట్రీస్‌ సేవలు అందిస్తున్నది.

2018లో హైదరాబాద్‌ కేంద్రంగా ర్యాండమ్‌ ట్రీస్‌ తమ కార్యకలాపాలను ప్రారంభించింది. ఇక్కడి యువతలో నైపుణ్యాలు, బీఆర్‌ఎస్‌ హయాంలో మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో హైదరాబాద్‌ కేంద్రంగా తమ సేవలు స్టార్ట్‌ చేసింది. జీసీసీల హబ్‌గా హైదరాబాద్‌ కొనసాగుతుండగా.. అన్ని జీసీసీలు ఏఐ నేటివ్‌ ఆర్గనైజేషన్లతో జత కట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ పరిణామాల దృష్ట్యా ఏఐలో నైపుణ్యం ఉన్నవారిని నియమించుకుంటున్నది. వచ్చే 18 నెలల్లో తమ కార్యకలాపాలను రెట్టిం పు చేయాలని ర్యాండమ్‌ ట్రీస్‌ భావిస్తున్నది.

కేసీఆర్‌ ప్రభుత్వంలో ఐటీ ప్రగతికి కృషి

తొమ్మిదిన్నరేండ్లలో తెలంగాణలో ఐటీ రంగం అభివృద్ధికి, హైదరాబాద్‌ను అంతర్జాతీయ సంస్థలకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మార్చేందుకు తమ ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేసిందని కేటీఆర్‌ పేరొన్నారు. గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ), అంతర్జాతీయ పెట్టుబడులు, సాంకేతిక సంస్థలు, నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలిపారు. హైదరాబాద్‌ కేవలం ఐటీ సేవలకే పరిమితం కాకుండా, ఏఐ పరిశోధన, డాటా సైన్స్‌, ఉత్పత్తుల అభివృద్ధి, సాంకేతిక ఆవిషరణలకు కూడా ప్రధాన కేంద్రంగా ఎదగాలని ఆకాంక్షించారు. ర్యాండమ్‌ ట్రీస్‌ వంటి సంస్థలు నగరంలో తమ కార్యకలాపాలను విస్తరించడం ద్వారా సాంకేతిక రంగానికి, యువత ఉపాధి అవకాశాలకు మరింత ఊతం లభిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

Comments (0)

User