ఫ్రెంచ్ ఫైనల్లో సింధు
పారిస్: భారత స్టార్ షట్లర్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో 31 ఏండ్ల సింధు 21-10, 20-22, 21-16తో మూడు గేమ్స్ పాటు పోరాడి ప్రపంచ 22వ ర్యాంకర్ హినా అకేచి ( జపాన్)పై ఘన విజయం సాధించింది.
గంటా 13 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సింధు తన మునుపటి ఫామ్ చూపెట్టింది. జూలైలో జపాన్ ఓపెన్ సూపర్ 750 టైటిల్ గెలుచుకున్న సింధుకు ఈ సీజన్‌లో రెండో సూపర్ 750 ఫైనల్ కావడం విశేషం. ఆదివారం జరగనున్న తుది పోరులో ప్రపంచ నంబర్ వన్, దక్షిణ కొరియా స్టార్ అన్ సే యంగ్ తో తలపడనుంది.

Pv Sindhu
Comments (0)