బీపీసీఎల్‌ లాభాలకు చమురు సెగ

25 October 2026 - 08:44
0 0
బీపీసీఎల్‌ లాభాలకు చమురు సెగ
Bpcl

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 24: భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లాభాలకు చమురు సెగ గట్టిగానే తగిలింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు పరుగులు పెట్టినప్పటికీ ధరలు పెంచకపోవడంతో గత త్రైమాసికపు లాభాలపై ప్రతికూల ప్రభావం చూపింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 22.5 శాతం తగ్గి రూ.4,993 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికానికిగాను సంస్థ రూ.6,443 కోట్ల లాభాన్ని చవిచూసింది.

సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.1.22 లక్షల కోట్ల నుంచి రూ.1.58 లక్షల కోట్లకు ఎగబాకింది. మౌలిక సదుపాయాల కల్పనకు, సరఫరా వ్యవస్థను మెరుగుపర్చడానికి, డిజిటల్‌ సేవలను విసృ్త2త పరుచడానికి భారీ స్థాయిలో నిధులను ఖర్చు చేయబోతున్నట్టు ప్రకటించింది. గత త్రైమాసికంలో ప్రతి బ్యారెల్‌ క్రూడాయిల్‌ను శుద్ది చేయడంతో 32.53 డాలర్ల ఆదాయం సమకూరినప్పటికీ లాభాల్లో గండిపడటం విశేషం. కిందటేడాది ఇదే త్రైమాసికంలో సంస్థ 10.78 డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. ప్రస్తుతం సంస్థకు దేశవ్యాప్తంగా 25,300 చమురు విక్రయ కేంద్రాలు, నిర్వహిస్తున్నది.

Comments (0)

User