Pragyan Ojha: చీఫ్ సెలెక్ట‌ర్‌గా ప్ర‌జ్ఞాన్ ఓజా.. క‌న్ఫ‌ర్మ్ చేసిన బీసీసీఐ

19 October 2026 - 22:15
0 0
Pragyan Ojha:  చీఫ్ సెలెక్ట‌ర్‌గా ప్ర‌జ్ఞాన్ ఓజా.. క‌న్ఫ‌ర్మ్ చేసిన బీసీసీఐ
Ojha

ముంబై : అనుకున్న‌ట్లే జ‌రిగింది. బీసీసీఐ చీఫ్ సెలెక్ట‌ర్‌గా ప్ర‌జ్ఞాన్ ఓజా సెలెక్ట్ అయ్యారు. అజిత్ అగార్క‌ర్ స్థానంలో ఓజా ఇక సేవ‌లు అందించ‌నున్నారు. అయితే తాజాగా బీసీసీఐ ప్యాన‌ల్‌లోకి ర‌మేశ్ ప‌వార్‌కు చోటు క‌ల్పించారు. టీమిండియా పురుషుల జ‌ట్టుకు సెల‌క్ష‌న్ క‌మిటీలో చీఫ్ సెలెక్ట‌ర్‌గా మాజీ బౌల‌ర్ ప్ర‌జ్ఞాన్‌ ఓజాను నియ‌మిస్తున్న‌ట్లు ఇవాళ బీసీసీఐ క‌న్ఫ‌ర్మ్ చేసింది. నిన్న‌టి వ‌ర‌కు తాత్కాలిక సెలెక్ట‌ర్‌గా ఓజా చేశాడు. ఇప్పుడు బీసీసీఐ అత‌నికి పూర్తి బాధ్య‌త‌లు అప్ప‌గించింది. అశోక్ మల్హోత్రా, జ‌తిన్ ప‌రాంజ‌పే నేతృత్వంలోని క్రికెట్ అడ్వైజ‌రీ క‌మిటీ .. మెన్స్ సెలెక్ష‌న్ క‌మిటీ స‌భ్యుల‌ను నియ‌మించే ప్ర‌క్రియ‌ను చేప‌ట్టింది.

సీనియార్టీ ఆధారంగా మెన్స్ సెలెక్ష‌న్ క‌మిటీ స‌మావేశాల‌కు ప్ర‌జ్ఞాన్ ఓజా నేతృత్వం వ‌హిస్తార‌ని బీసీసీఐ చెప్పింది. టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఆధారంగా ఆ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. క‌మిటీలో శివ సుంద‌ర్ దాస్‌, ఆర్పీ సింగ్, అజ‌య్ రాత్రా, ర‌మేశ్ పొవార్ ఉన్నారు. భార‌త మెన్స్ క్రికెట్ జ‌ట్టును ఎంపిక చేసే బాధ్య‌త ఈ అయిదుగురి స‌భ్యుల‌పై ఉంటుంది.

48 ఏళ్ల ప‌వార్ రెండు టెస్టులు, 31 వ‌న్డేలు ఆడాడు. 2004 నుంచి 2007 మ‌ధ్య అత‌ను ఇండియాకు రిప్ర‌జెంట్ చేశాడు. భార‌త మ‌హిళ క్రికెట్ జ‌ట్టుకు రెండు సార్లు హెడ్ కోచ్‌గా కూడా పొవార్ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించాడు. ఆయ‌న కోచ్‌గా ఉన్న‌ప్పుడే మ‌హిళ‌ల జ‌ట్టు ఆసియాక‌ప్ టైటిల్ గెలుచుకున్న‌ది. కామన్‌వెల్త్ గేమ్స్‌లో సిల్వ‌ర్ ద‌క్కింది. బీసీసీఐ సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్‌లోనూ అత‌ను స్పిన్ బౌలింగ్ కోచ్‌గా చేశాడు.

మాజీ చీఫ్ సెలెక్ట‌ర్ అజిత్ అగార్క‌ర్‌పై బీసీసీఐ ప్ర‌శంస‌లు కురిపించింది. ఆయ‌న ప‌ద‌వీ కాలంలో ఇండియా మూడు ఐసీసీ ట్రోఫీలు, రెండు ఆసియాక‌ప్ టైటిళ్లతో పాటు ఏషియ‌న్ గేమ్స్‌లో గోల్డ్‌ గెలుచుకున్న‌ట్లు బీసీసీఐ కార్య‌ద‌ర్శి దేవ‌జిత్ సైకా తెలిపారు.

Comments (0)

User