Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ

19 October 2026 - 22:15
0 0
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
Iron Rod Pierces Boy's Mout

గాంధీనగర్‌: ఒక బాలుడు ఇంటి బయట ఆడుతూ కిందపడ్డాడు. అక్కడ ఉన్న ఒక ఇనుప కడ్డీ ఆ బాలుడి నోటిలోకి చొచ్చుకెళ్లింది. ఆందోళన చెందిన తల్లిదండ్రులు అతడ్ని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒక ప్రైవేట్‌ డెంటల్‌ డాక్టర్‌ సహాయంతో వైద్యులు సర్జరీ చేసి ఐరాన్‌ రాడ్‌ ముక్కను బయటకు తీశారు. ఆ బాలుడి ప్రాణాలు కాపాడారు. (Iron Rod Pierces Boy’s Mouth) గుజరాత్‌లోని పటాన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. వేద్ గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలుడు ఇంటి బయట ఆడుకుంటూ అదుపుతప్పి నేలపై పడ్డాడు. అక్కడ ఉన్న ఒక సన్న ఇనుప కడ్డీ అతడి నోటిలోకి బలంగా గుచ్చుకున్నది. దీంతో తీవ్ర రక్తస్రావం జరిగింది.

కాగా, ఇది చూసిన బాలుడి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. వెంటనే 108 అత్యవసర సేవలకు సమాచారం అందించారు. అంబులెన్స్‌లో రాధన్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి అతడిని తరలించారు. వైద్యులు ఆ బాలుడిని పరీక్షించారు. దంతాలు, దవడ భాగంలో లోతుగా ఆ ఇనుప కడ్డీ ఇరుక్కున్నట్లు గుర్తించారు. చాలా సున్నిత భాగంలో అది చిక్కుకోవడంతో దానిని తొలగించడానికి ప్రత్యేక శస్త్రచికిత్స బృందాన్ని ఏర్పాటు చేశారు. అలాగే సహాయం కోసం ఒక ప్రైవేట్ డెంటల్ సర్జన్‌ను కూడా పిలిపించారు.

మరోవైపు ఈ వైద్య బృందం సుమారు గంటరన్నర పాటు క్లిష్టమైన ఆపరేషన్ నిర్వహించింది. బాలుడి దవడ, చుట్టుపక్కల కణజాలాలకు ఎలాంటి నష్టం జరుగకుండా వైద్యులు జాగ్రత్తగా ఆ ఇనుప ముక్కను తొలగించి అతడి ప్రాణాలు కాపాడారు. ఇలాంటి ప్రమాదాలు నివారించేందుకు బహిరంగ ప్రదేశాలలో ఆడుకునే పిల్లలను తల్లిదండ్రులు నిశితంగా గమనించాలని డాక్టర్లు సూచించారు.

Comments (0)

User