KBR Park | ఎక్కడి స్తంభాలు అక్కడే.. పనులు ఆగిన కేబీఆర్‌ పార్క్‌ వద్ద అధ్వాన స్థితి!

26 October 2026 - 12:08
0 0
KBR Park | ఎక్కడి స్తంభాలు అక్కడే.. పనులు ఆగిన కేబీఆర్‌ పార్క్‌ వద్ద అధ్వాన స్థితి!
Hydra

KBR Park | సిటీబ్యూరో, అక్టోబర్‌ 25 (నమస్తే తెలంగాణ): అభివృద్ధి పనులు ప్రజలకు సౌకర్యాలు కల్పించాలి కానీ అవే పనులు ప్రజల భద్రతకు ముప్పుగా మారితే బాధ్యత తీసుకునేవారెవరు.. ప్రస్తుతం నగరంలోని కీలకమైన కేబీఆర్‌ పార్క్‌ వద్ద పరిస్థితి ఇది. నిత్యం రద్దీ ఉండే ఈ ప్రాంతంలో అభివృద్ధి పేరుతో గుంతలు తవ్వారు.. రోడ్డుపై విద్యుత్‌ స్తంభాలు చిందరవందరగా పడేయడంతో పాటు అండర్‌గ్రౌండ్‌ కేబుల్స్‌ను ప్రమాదకరంగా వదిలేశారు. ఆ ప్రాంతంలో మొన్నటివరకు వన్‌వే అమలు చేశారు. చివరకు ప్రణాళికల్లో మార్పులతో పనులన్నీ తారుమారయ్యాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ప్రయాణించే వారు నిత్యం నరకం చూస్తున్నారు.

నగరంలో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించి ప్రజలకు మెరుగైన రవాణాసౌకర్యం కల్పిస్తామంటూ కేబీఆర్‌ పార్కు వద్ద ఎలివేటెడ్‌ కారిడార్‌ ఫ్లై ఓవర్‌ నిర్మాణం పనులు చేపట్టారు. ఇందులో భాగంగా విద్యుత్‌ నెట్‌వర్క్‌ షిఫ్టింగ్‌ పనులు జరుగుతున్నాయి. టీజీఎస్‌పీడీసీఎల్‌ మాస్టర్‌ ప్లాన్‌ విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పనులు ప్రస్తుతం నత్తనడకన సాగుతుండడంతో ప్రమాదకర పరిస్థితి నెలకొంది. కేబీఆర్‌ పార్కు చౌరస్తాలో ఈ పనులకోసం తీసిన గోతులు కొద్దిరోజులుగా ఎలాంటి పనులు లేకపోవడంతో యథావిధిగా వదిలేశారు. పనులను వేగవంతం చేయాలంటూ ఉన్నతాధికారులు ప్రత్యేకించి ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ జితేష్‌ పాటిల్‌ ఆదేశించినా క్షేత్రస్థాయిలో మాత్రం పనులలో పురోగతి లేదు.

బయటకు తేలిన విద్యుత్ కేబుళ్లు

ఫ్లైఓవర్ నిర్మాణపనులకు అనుగుణంగా ఇప్పటికే ఉన్న విద్యుత్ స్తంభాలు, లైన్లు, కేబుళ్ల, ఇతర నెట్వర్క్ వ్యవస్థను తరలించే ప్రక్రియ జరుగుతోంది. అయితే ఫిలింనగర్, కేబీ ఆర్ పార్కు జంక్షన్, అగ్రసేన్మహారాజాజంక్షన్ తదితర చోట్ల 11కేవీ, 33కేవీ విద్యుత్ లైన్లను యూజీ కేబుల్గా మార్చేందుకు ప్రణాళిక రూపొందించినప్పటికీ పనులు మొదలు కాలేదు. ఇక్కడ తీసిన గోతులు ప్రమాదకరంగా మారడమే కాకుండా రోడ్డుపైనే స్తంభాలు ఇష్టారాజ్యంగా పడేసిన పరిస్థితి ఉంది. మరోవైపు యూజీ కేబుల్ ఉన్నచోట్ల కొన్ని బయటకు తేలి కనిపిస్తున్నాయి. మరికొన్ని చోట్ల వేయడానికి అనుకూలంగా వైర్లన్నీ బయటకు తీసి పెట్టారు. ఇలా పలురకాలుగా పనులు చేస్తుండడంతో ఇవి వెంటవెం టనే జరిగితే ప్రజలు అప్రమత్తంగా ఉండే అవకాశముంది. ఏరోజు పనులు జరుగుతాయో ఎప్పుడు ఆగిపోతాయో తెలి యక విద్యుత్ స్తంభాలు ఇన్సులేటర్లతో సహా ఉండడం, కొన్ని చోట్ల భూగర్భ కేబుళ్లు బయటకు తేలి ఉండడంతో ప్రాణాపాయంగా ఉన్నాయంటూ స్థానికులు చెబుతు న్నారు. అయితే కారిడార్ పనులు జరిగినా జరగకున్నా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిని పర్యవేక్షించాల్సింది పోయి ఈ జంక్షన్లనే గాలికొదిలేశా రంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాహిల్స్ సర్కిల్కు సంబంధించిన అధికారులు అత్యవస రంగా ఇక్కడ నిలిచిపోయిన పనులను పూర్తిచేసి స్థానికులకు ప్రాణాపాయం లేకుండా చేయాలని వారు కోరుతున్నారు. ప్రజల భద్రత, నిరంతరాయ విద్యుత్ సరఫరాను దృష్టిలో పెట్టుకుని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తే పనులు త్వరితగతిన పూర్తయ్యే అవకాశముంటుందని అధికారులు చెప్పారు. ఈ పనుల విషయంలో కార్పొరేట్ ఆఫీసు నుంచి వచ్చే సూచనలను తాము పాటిస్తామని, ముందస్తు ప్రణా ళికతో ఉన్నతాధికారులు పనులు మొదలుపెట్టి క్షేత్రస్థా యిలో తమతో పనులు చేయిస్తున్నారని, ఈ విషయంలో తాము సొంతంగా నిర్ణయం తీసుకోలేమంటూ సర్కిల్ అధి కారులు చెప్పారు.

పనుల్లో జాప్యమేలా!

ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అవసరమైన పనుల కోసం రహదారి పరిసరాల్లో తవ్వకాలు చేపట్టారు. అయితే పనులు జరుగుతున్న సమయంలో విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లు, రహదారి భద్రతకు అత్యంత ప్రాధాన్యమి వ్వాలి. స్తంభాలను తరలించాల్సి వచ్చినప్పుడు ఆ ప్రక్రి యను వెంటవెంటనే పూర్తి చేయాలి. క్షేత్రస్థాయిలో కొందరు సిబ్బంది తమకు ఇతర శాఖల వారు సహకరించడం లేదని, అందుకే తామేం చేయలేకపోతున్నామంటూ ఆరోపిస్తున్నారు. స్తంభాలు తీసేసి ఇష్టారాజ్యంగా పడే యడం, వాటిని మరోచోటికి తరలిస్తారా.. లేక ఉన్నచోటే ఉంచుతారా అనేది కూడా అధికారులు నిర్ణయించలేకపో తున్నారు. ఇదిలా ఉంటే కేబుల్స్ కోసం తవ్విన గుంతలు కూడా పూడ్చకుండానే ఉన్నారు. నమస్తే తెలంగాణ ఆ ప్రాంతంలో పరిస్థితులను చూస్తున్నప్పుడు కొన్ని గుంత లను పక్కనే ఉన్న గులకరాళ్లతో హడావిడిగా పూడ్చేస్తూ ఫొటోలు తీయొద్దంటూ అక్కడ పనిచేస్తున్న సిబ్బంది కోరారు. పనులు వెంటవెంటనే పూర్తిచేయాలంటూ ఈనెల 2న క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చిన జితేష్ పటిల్ చెప్పినప్ప టికీ ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో జాప్యం ఏర్పడడంతో తీసిన గుంతలు పూడ్చడం కానీ, తొలగించిన స్తంభాలను ఎక్కడ ఏర్పాటు చేయాలనేది కానీ ఇప్పటివరకు సర్కిల్, సెక్షన్ లెవల్లో ఎవరికీ చెప్పకపోవడం గమనార్హం. ఈ సమస్య వల్ల ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాద ముందని స్థానికులు చెప్పారు.

Comments (0)

User