Kaleshwaram | ఎట్టకేలకు బరాజ్‌ల రిపేర్‌.. కరువు నేపథ్యంలో కాళేశ్వరం మరమ్మతులకు కార్యాచరణ

25 October 2026 - 08:44
0 0
Kaleshwaram | ఎట్టకేలకు బరాజ్‌ల రిపేర్‌.. కరువు నేపథ్యంలో కాళేశ్వరం మరమ్మతులకు కార్యాచరణ
Kaleshwaram

Kaleshwaram | హైదరాబాద్‌, అక్టోబర్‌ 24 (నమస్తే తెలంగాణ): ఒకవైపు కరువు.. మరోవైపు విమర్శలు రావడంతో సర్కా ర్‌లో కదలిక వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల మరమ్మతులకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించింది. పునరుద్ధరణ పనుల వివరాలను సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉ త్తమ్‌కుమార్‌రెడ్డి తాజాగా వెల్లడించారు. మేడిగడ్డ బరాజ్‌ లోని 7వ బ్లాక్‌లో సాంకేతిక లోపం తలెత్తిన విషయం తెలిసిందే.

అదేవిధంగా అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల్లోనూ లోపాలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఎన్‌డీఎస్‌ఏ గతంలో సూచిస్తూ మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రస్తు తం 7వ బ్లాక్‌లో 6 పియర్లను పూర్తిగా తొలగించాలని, లేదంటే మొత్తంగా బ్లాక్‌ 7ను తొలగించి పునర్నిర్మించా లని ప్రతిపాదనలను సిద్ధం చేశారు. సీపేజీ నియంత్రణకు అవసరమైనచోట కాంక్రీట్‌ బ్లాకులను, సీకెంట్‌ ఫైల్స్‌ ఎ గువన 3 బరాజ్‌ల పొడవునా డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించా లని ప్రతిపాదనలు చేసింది. త్వరలో టీవోసీ సమావేశం లో వీటిపై చర్చించనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.

Comments (0)

User