Flyover Trolls | తెలంగాణలో బీజేపీపై ఫ్లైఓవర్ల ఫన్నీ ట్రోల్స్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సరదా కౌంటర్లు!

3 November 2026 - 19:29
0 0
Flyover Trolls | తెలంగాణలో బీజేపీపై ఫ్లైఓవర్ల ఫన్నీ ట్రోల్స్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సరదా కౌంటర్లు!
Bjp

Uppal Flyover | సోషల్ మీడియాలో రాజకీయ పార్టీల పోస్టులు, వాటికి నెటిజన్లు ఇచ్చే కౌంటర్లు ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటాయి. తాజాగా తెలంగాణ బీజేపీ (Telangana BJP) పెట్టిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తూ తెగ వైరల్ అవుతోంది.

సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌లో నిర్వహించిన భారీ ర్యాలీకి సంబంధించిన పోస్ట్ ఒకదానిని తెలంగాణ బీజేపీ అధికారిక సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే రాబోతోందని, మ‌న‌ల్నీ ఎవ‌డ్రా ఆపేది అన్న‌ట్లుగా ఒక పోస్ట్ పెట్టింది. అయితే, ఈ పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. కొంతమంది బీజేపీ రాదని కామెంట్లు చేస్తుండగా, మరికొంతమంది మాత్రం పూర్తిగా క్రియేటివిటీని జోడించి ఫన్నీగా ట్రోల్ చేయడం ప్రారంభించారు.

ఎక్స్‌లో ‘ఉప్పల్ ఫ్లైఓవర్’ (Uppal Flyover) పేరుతో ఉన్న ఒక ట్రోల్ హ్యాండ్లర్.. “నేను ఆపుతాను రా!” అంటూ ఆ బీజేపీ పోస్ట్‌కు సరదాగా కామెంట్ పెట్టాడు. ఇంకేముంది, దీనికి నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఆ వెంటనే మెడ్చల్ ఫ్లైఓవర్, సుచిత్ర ఫ్లైఓవర్, కొంపల్లి ఫ్లైఓవర్‌ల పేర్లతో ఉన్న ఇతర హ్యాండ్లర్లు కూడా ఈ సరదా ట్రోలింగ్‌లో జతకలిశాయి. అంతేకాకుండా నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట ప్రాంతాల నుంచి ‘ROB’ (Rail Over Bridge) పేర్లతో ఉన్న ఖాతాలు కూడా రంగంలోకి దిగాయి. “నువ్వు ఎలా వస్తావో మేము చూస్తాం” అంటూ బీజేపీని ఉద్దేశించి ఫన్నీగా కామెంట్లు చేస్తూ నెట్టింట నవ్వులు పూయిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫ్లైఓవర్ల ఫన్నీ చాటింగ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఫ్లైఓవ‌ర్‌లు అన్ని కేంద్ర ప్ర‌భుత్వ హ‌యాంలో ప్రారంభ‌మై ఇప్ప‌టికీ పూర్తి కాక‌పోవ‌డంతో ప్ర‌జ‌లు ఈ ర‌కంగా ట్రోల్ చేస్తున్నారు.

Comments (0)

User