Supreme Court: నిరసన ప్రదేశాన్ని ఆక్రమించుకోవడం సరికాదు: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: నిరసన పేరుతో ఓ ప్రదేశాన్ని ఎవరు కూడా నిరవధికంగా ఆక్రమించుకోలేరని సుప్రీంకోర్టు (Supreme Court) పేర్కొన్నది. ఆయా ప్రదేశాల్లో జరుగుతున్న ఆందోళనలకు నిర్దేశిత టైం పీరియడ్ ఉండాలని కోర్టు అభిప్రాయపడింది. సీఈసీకి వ్యతిరేకంగా గత నెలలో సెంట్రల్ ఢిల్లీలో విపక్షాలు భారీ ఎత్తు నిరసన ప్రదర్శన చేపట్టిన విషయం తెలిసిందే. ఆ ఆందోళన గురించి ఇవాళ సుప్రీంలో వాదనలు జరిగాయి. ప్రభుత్వ న్యాయవాది తుషార్ మెహతా స్పందిస్తూ.. నిరసన ప్రదర్శనకు ఎవరు పిలుపు ఇచ్చినా, దాని పర్యవసానాలను వాళ్లే ఎదుర్కోవాలని సుప్రీంకోర్టు తుషార్ మెహతా తెలిపారు. ఓ సైట్‌ను ఎప్పటికీ ఆక్రమించలేరని, నిరసన చేపట్టేందుకు ఇతరులు కూడా ఉన్నారని, రైతుల.. లాయర్లు ఎక్కడికి వెళ్తారని, ప్రతి ఒక్కరికీ నిరసన చేపట్టే హక్కు ఉందని సీజేఐ సూర్యకాంత్ అన్నారు.
Comments (0)