Abishan Jeevinth | తండ్రి అయిన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ దర్శకుడు అభిషన్ జీవింత్.!

సంచలన తమిళ చిత్రం ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ (Tourist Family) ద్వారా నటుడిగా మరియు దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అభిషన్ జీవింత్ (Abishan Jeevinth) తండ్రి అయ్యారు. ఆయన సతీమణి అఖిల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ ఆనందకరమైన విషయాన్ని అభిషన్ స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
తన నవజాత కూతురితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. అధికారికంగా తండ్రి అయ్యాను (Officially A Girl Dad) అంటూ భావోద్వేగంతో ఒక పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుండగా, కోలీవుడ్ సినీ ప్రముఖులు, నటీనటులు ఈ డైరెక్టర్‌కు సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అభిషన్ జీవింత్ తన చిన్ననాటి స్నేహితురాలైన అఖిలను గతేడాది అక్టోబర్ 31, 2025న వివాహం చేసుకున్నారు. పెళ్లయిన ఏడాది తిరిగేసరికి వీరు పండంటి పాపకు తల్లిదండ్రులు కావడంతో వారి కుటుంబంలో సంబరాలు మిన్నంటాయి.
Comments (0)