AP News | ధ‌ర్మ‌వ‌రం మున్సిపాలిటీలో ఆస‌క్తిక‌ర ఫ‌లితం.. ఒక్క ఓటు తేడాతో గెలిచిన వైఎస్సార్ కాంగ్రెస్‌

3 November 2026 - 19:29
0 0
AP News | ధ‌ర్మ‌వ‌రం మున్సిపాలిటీలో ఆస‌క్తిక‌ర ఫ‌లితం.. ఒక్క ఓటు తేడాతో గెలిచిన వైఎస్సార్ కాంగ్రెస్‌
Counting

AP News : ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపాలిటీలో ఆసక్తికర ఫ‌లితం వెలువ‌డింది. పట్టణంలోని 1వ వార్డులో వైసీపీ అభ్యర్థి రామకృష్ణమ్మ కేవలం ఒక్క ఓటు తేడాతో గెలిచారు. ఈ ఫలితంపై బీజేపీ అభ్యర్థి సాకే లక్ష్మీదేవి అభ్యంతరం వ్యక్తంచేశారు. కేవలం ఒక్క ఓటు తేడా ఉండటంతో ఓట్లను తిరిగి లెక్కించాలని ఆమె పట్టుబట్టారు.

ఆమె అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సిబ్బంది 1వ వార్డులో రీకౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ పరిణామంతో కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్న‌ది. అధికారులు ఓట్లను మరోసారి లెక్కిస్తుండటంతో ఇరుపార్టీల ఏజెంట్లలోనూ టెన్షన్ నెలకొన్న‌ది. మ‌ళ్లీ ఫలితం ఎలా వ‌స్తుందోన‌ని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Comments (0)

User