Cyclone Arnab | ‘అర్ణబ్‌’తో కోస్తాంధ్రకు వణుకు వాతావరణ శాఖ హైఅలర్ట్‌

26 October 2026 - 12:08
0 0
Cyclone Arnab | ‘అర్ణబ్‌’తో కోస్తాంధ్రకు వణుకు వాతావరణ శాఖ హైఅలర్ట్‌
Cyclone Arnab

Cyclone Arnab | హైదరాబాద్‌, అక్టోబర్‌ 25 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి ‘అర్ణబ్‌’ తీవ్ర తుఫానుగా మారనున్నదని వాతావరణ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్ర జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ హై అలర్ట్‌ ప్రకటించింది. విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అంచనా ప్రకారం.. ఈ తుఫాను కాకినాడ-నర్సాపురం మధ్య కోనసీమ ప్రాంతం గుండా తీరందాటే పరిస్థితులు ఉన్నాయ ని తెలిపింది.

తుఫాను తీరం దాటే సమయంలో గంటకు దాదాపు 140 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. తుఫాను తీవ్రత కారణంగా కోస్తాంధ్ర వ్యాప్తంగా కుంభ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నదని, కొన్ని ప్రాంతాల్లో 20 సెం.మీకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నదని తెలిపిం ది. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తం గా ఉండాలని సూచించింది.

Comments (0)

User