Bloody Romeo | నాని బ్ల‌డీ రోమియో షూటింగ్ షురూ.. ఇంత‌కీ లొకేష‌న్ ఎక్క‌డో తెలుసా..?

19 October 2026 - 22:15
0 0
Bloody Romeo | నాని బ్ల‌డీ రోమియో షూటింగ్ షురూ.. ఇంత‌కీ లొకేష‌న్ ఎక్క‌డో తెలుసా..?
Bloody Romeo

Bloody Romeo | రీసెంట్‌గా శ్రీకాంత్ ఓదెల డైరెక్ష‌న్‌లో ప్యార‌డైజ్‌ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు నాని. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. అక్టోబ‌ర్ 22న నెట్‌ఫ్లిక్స్‌లో కూడా సంద‌డి చేయ‌బోతుంది. కాగా ఇక త‌న నెక్ట్స్ మూవీ బ్ల‌డీ రోమియో (Bloody Romeo)పై ఫోక‌స్ షిప్ట్ చేశాడు నాని. అభిమానులు, మూవీ ల‌వ‌ర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న షూటింగ్ టైం రానే వ‌చ్చింది. ఫిలింన‌గ‌ర్ స‌ర్కిల్ స‌మాచారం ప్ర‌కారం దేశ‌రాజ‌ధాని న‌గ‌రం ఢిల్లీలో బ్ల‌డీ రోమియో షూటింగ్ మొద‌లైంది.  ఢిల్లీలో వారంపాటు ఈ తొలి షెడ్యూల్ కొన‌సాగ‌నుంద‌ట‌.

ఢిల్లీ షూటింగ్ త‌ర్వాత నాని  టీం నెక్ట్స్ షెడ్యూల్ కోసం హైద‌రాబాద్‌కు ప‌యనం కానుంద‌ని ఇన్‌సైడ్ టాక్‌. ఇదిలా ఉంటే ఇంత‌కీ నానితో రొమాన్స్ చేయ‌బోయే భామ ఎవ‌ర‌నేది ఇంకా స‌స్పెన్స్‌లోనె పెట్టేశారు మేక‌ర్స్.. నిహారికా ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు సంగీతం అందిస్తున్నాడు. మేక‌ర్స్ ఈ మూవీని 2027 వేస‌వి కానుక‌గా విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

నాని ఈ సారి సూపర్ స్టైలిష్‌గా కనిపించబోతున్నట్టు బ్లడీ రోమియో టీం ఇటీవ‌లే రిలీజ్‌ చేసిన వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చేశారు మేక‌ర్స్. నాని ఇందులో గ్యాంగ్‌స్టర్‌ నుంచి చెఫ్‌గా మారిన వ్యక్తిగా కనిపించబోతున్నాడని ఇన్‌సైడ్‌ టాక్. స్టైలిష్ హెయిర్‌ అండ్ బ్లాక్ గూగుల్స్‌ లో మేకోవర్‌ అయిన నాని లుక్‌తోపాటు సుజీత్‌ టీం ఫుడ్‌ ట్రక్‌పై.. Bloody Romeo.. The Kitchen Open Soon అని రాసిన వీడియోను షేర్ చేయ‌గా నెట్టింట వైర‌ల్ అవుతోంది.

Read Also :

Thalasani Srinivas Yadav | స‌ద్దుల బ‌తుక‌మ్మ‌లో స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టిన‌ త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌

Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్‌ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!

woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

 

 

Comments (0)

User