భూకంపం సమయంలో బ్యాంకాక్‌లోని ఎత్తైన భవనాలు ఊగుతున్న దృశ్యాలు, బిల్డింగ్‌పైన ఉన్న ఈతకొలనుల నుంచి నీరు ఎగసిపడుతున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. బ్యాంకాక్‌లోని చతుహక్ జిల్లాలోని అసంపూర్తిగా ఉన్న ఆడిటర్ జనరల్ ప్రధాన కార్యాలయమే భూకంప సమయంలో కూలిపోయిన ఏకైక బిల్డింగ్
మొగల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి మహారాష్ట్రలోని శంభాజీనగర్ జిల్లా (గతంలో ఔరంగాబాద్), ఖుల్తాబాద్‌లో ఉంది. ఈ ప్రాంతంలో ఇంకా ఎన్నో చారిత్రక ఆనవాళ్లున్నాయి. వాటిలో 20వ శతాబ్దంలో నిర్మించిన మరో సమాధి ఒకటి.
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు అమెరికా నుంచి ఎలక్ట్రిక్ కార్లను ఎగుమతి చేస్తున్న టెస్లాకు భారత మార్కెట్లో ఎంటరయ్యేందుకు ఇవే సమస్యగా మారాయి.
విదేశీ కార్లు భారత్ లో దిగుమతి చేసుకుంటే ఏకంగా 110 శాతం పన్ను ఉండేది. కానీ తాజాగా ప్రధాని మోడీతో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ జరిపిన చర్చలతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఓ కీలక నిర్ణయం ఇప్పుడు వీరికి లైన్ క్లియర్ చేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. సోమవారం రోజు తెల్లవారుజామున ఒక్కసారిగా భూమి కంపించింది. దీంతో ప్రజలంతా తీవ్ర భయాందోళనకు గురవుతూనే ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఈక్రమంలోనే భారీ స్థాయిలో బూమ్ అనే శబ్దం వినిపించగా.. మరింత వణికిపోయారు. అయితే ఢిల్లీ భూకంప సమయంలో వచ్చిన ఈ బూమ్ శబ్దానికి ఓ పెద్ద కారణమే ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
సోషల్ మీడియా సెన్సేషన్ మోనాలిసా భోస్లేకు వరుస జాక్పాట్లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆమెకు సినిమా ఆఫర్ రాగా.. ప్రస్తుతం షాపింగ్ మాల్స్ ఓపెనింగ్లకు కూడా వెళ్తోంది. అయితే తాజాగా మోనాలిసాకు ఖరీదైన డైమండ్ నెక్లెస్‌ను ఓ బిజినెస్మెన్ గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇంతకీ ఆ బిజినెస్మెన్ ఎవరు. మోనాలిసాకు అంత ఖరీదైన బహుమతి ఎందుకు ఇచ్చారు. ఆ డైమండ్ నెక్లెస్ ధర ఎంత అనే విషయాలు ఈ స్టోరీలో...!
మహా కుంభమేళాలో మరోసారి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కుంభమేళా ప్రారంభం అయినప్పటినుంచి ఫైర్ యాక్సిడెంట్ జరగడం ఇది మూడోసారి కావడం గమనార్హం. గతంలో రెండుసార్లు అగ్ని ప్రమాదాలు జరగ్గా.. తాజాగా మళ్లీ మంటలు అంటుకున్నాయి. దీంతో టెంట్లు కాలిబూడిదయ్యాయి. అయితే ఈ అగ్ని ప్రమదాంలో ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అమెరికాలో అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశాక భారత్ కు డొనాల్డ్ ట్రంప్ చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా తన ప్రమాణస్వీకారానికి భారత ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించని ట్రంప్.. ఆ తర్వాత భారతీయ వలసల్ని గుర్తించి వెనక్కి పంపేస్తున్నారు.