AP News | ఆరేళ్ల బాలిక‌పై అత్యాచారం, హ‌త్య‌.. ప్రకాశం జిల్లాలో దారుణం..!

26 October 2026 - 12:08
0 0
AP News | ఆరేళ్ల బాలిక‌పై అత్యాచారం, హ‌త్య‌.. ప్రకాశం జిల్లాలో దారుణం..!

AP News : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో దారుణం జ‌రిగింది. నాగులుప్పలపాడు మండలంలో ఆరేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఆపై ఆమెను దారుణంగా హ‌త్య‌చేశాడు. ఆదివారం అర్ధ‌రాత్రి ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఈ ఘ‌ట‌న తీవ్ర క‌ల‌క‌లం రేపింది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌న ప్రాంతానికి చేరుకుని స్థానికుల‌ను వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

కాగా బాలిక త‌ల్లిదండ్రులు ఆమెను అమ్మమ్మ ద‌గ్గ‌ర ఉంచి హైదరాబాద్‌లో భ‌వ‌న‌నిర్మాణ పనులకు వెళ్లారు. ఆదివారం అర్ధరాత్రి ఇంటి ద‌గ్గ‌ర‌ ఆరుబయట నిద్రిస్తున్న బాలికను అదే కాలనీకి చెందిన ఆనంద్‌ అక్కడి నుంచి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను హతమార్చి ఆమె ఇంటిముందు ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి పరారయ్యాడు. నిందితుడిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాలిక మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు.

Comments (0)

User