Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై గందరగోళం.. నాగవంశీ పోస్ట్‌తో కన్ఫ్యూజన్!

26 October 2026 - 12:08
0 0
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై గందరగోళం.. నాగవంశీ పోస్ట్‌తో కన్ఫ్యూజన్!
Adarsha K

Aadarsha Kutumbam | విక్టరీ వెంకటేశ్‌ కథానాయకుడిగా, శ్రీనిధి శెట్టి కథానాయికగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్‌ కూడా సినిమాపై ఆసక్తిని పెంచింది. అయితే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ విషయంలో అభిమానుల్లో గందరగోళం నెలకొంది. ‘ఆదర్శ కుటుంబం’ ప్రీ రిలీజ్‌ వేడుకను ఈ నెల 27న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించనున్నట్లు గతంలో ప్రకటించారు. దీంతో వెంకటేశ్‌ అభిమానులు ఈ వేడుక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్‌, వెంకటేశ్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఈ కార్యక్రమానికి సంబంధించిన అప్‌డేట్స్‌పై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

అయితే నిర్మాత నాగవంశీ తాజాగా చేసిన ఓ పోస్ట్‌ అభిమానులను అయోమయానికి గురిచేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని వాతావరణ పరిస్థితులను బట్టి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ గురించి త్వరలోనే ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. దీంతో ఇప్పటికే తేదీ, వేదికను ప్రకటించిన తర్వాత మళ్లీ ఇలా చెప్పడం ఏంటని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈవెంట్‌ నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నట్లు నిర్మాత చేసిన ప్రకటనతో వేడుక వాయిదా పడుతుందా? లేక ముందుగా ప్రకటించిన తేదీనే కొనసాగిస్తారా? అనే సందేహాలు మొదలయ్యాయి. అయితే ఈవెంట్‌ వాయిదా పడినట్లు ఇప్పటివరకు స్పష్టమైన అధికారిక ప్రకటన వెలువడలేదు.

దీంతో ప్రీ రిలీజ్‌ వేడుక విషయంలో చిత్ర బృందం నుంచి వచ్చే తదుపరి ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అసలు ఈ నెల 27న కార్యక్రమం జరుగుతుందా? వేదిక లేదా తేదీలో మార్పులు ఉంటాయా? అన్నది మేకర్స్‌ అధికారికంగా వెల్లడిస్తేనే స్పష్టత రానుంది. మరోవైపు ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్‌ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. వెంకటేశ్‌ తనదైన సహజమైన నటనతో ప్రేక్షకులను అలరించనున్నారని అభిమానులు ఆశిస్తున్నారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తుండటంతో కుటుంబ భావోద్వేగాలు, వినోదానికి ప్రాధాన్యం ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.

Comments (0)

User