విక్టోరియా నయా మాడల్‌

25 October 2026 - 08:44
0 0
విక్టోరియా నయా మాడల్‌
16

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 24: మారుతి సుజుకీ మరో మాడల్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే ప్రజాధరణ పొందిన విక్టోరియాలో ఔరం ఎడిషన్‌గా పరిచయం చేసింది. ఈ మాడల్‌ ప్రారంభ ధర రూ.16.43 లక్షలు కాగా, గరిష్ఠంగా రూ.19.99 లక్షలుగా నిర్ణయించింది.

దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టి ఏడాది పూర్తైన సందర్భంగా ఈ నయా మాడల్‌ను తీసుకొచ్చినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా హైబ్రిడ్‌ వెర్షన్‌లో రూ.22,990 విలువైన యాక్సెసరీ కిట్‌ ఉచితంగా అందిస్తున్నది. 1.5 లీటర్ల ఇంజిన్‌తో తయారైన ఈ మాడల్‌ 28.65 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది.

Comments (0)

User