రాగస: ఈ తుపానును ‘King of storms’ అని ఎందుకంటున్నారు..?

Sep 24, 2025 - 10:54
 0  1
రాగస: ఈ తుపానును ‘King of storms’ అని ఎందుకంటున్నారు..?
ఫిలిప్పీన్స్‌లో తుపాను హెచ్చరికల నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లోని వేలాది మందిని అధికారులు ఖాళీ చేయించారు.

హాంకాంగ్‌‌వైపు సూపర్ టైఫూన్ రాగస రానున్న నేపథ్యంలో టైఫూన్ వార్నింగ్‌ను 8కి ఎనిమిదికి అప్‌గ్రేడ్ చేసింది. గరిష్ట స్థాయి కంటే ఇది కేవలం రెండు స్థాయిలు తక్కువ.10 నగరాల్లోని స్కూళ్లు, కొన్ని బిజినెస్‌లను తుపాను తగ్గేవరకు మూసివేయాలని ఆదేశించింది.

ఈ తుపానుకు 'రాగస' అనే పేరు పెట్టారు.సోమవారం తీరాన్ని తాకిన తరువాత ఇది కొంత బలహీనపడింది.తుపాను కారణంగా మూడు మీటర్ల (10 అడుగులు) ఎత్తుకు అలలు ఎగసిపడతాయని ఫిలిప్పీన్స్ వాతావరణ శాఖ అంచనా వేసింది.

రాగస ప్రభావం ఉంటుందన్న అంచనాలతో దక్షిణ చైనా, తైవాన్‌లోనూ ముందస్తు చర్యలు చేపట్టారు.ఈ తుపాను బుధవారం చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో తీరాన్ని తాకే అవకాశం ఉంది.అక్కడ నుంచి ఇప్పటికే 370,000 మందిని ఖాళీ చేయించారు.

రాగస ను చైనా వాతావరణ సంస్థ ‘కింగ్ ఆఫ్ స్ట్రామ్స్’ అని వర్ణించింది.రాబోయే రోజుల్లో ఈ తుపాను ఉత్తర వియత్నాంవైపు కదులుతుందని, లక్షలాది మందిని ప్రభావితం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Rasipogula Gopal Editor-in-Chief