2500 ఏళ్ల కిందట మనిషి ముఖం ఎలా ఉండేది? పుర్రెల ఆధారంగా ఆకృతులు రూపొందిస్తున్న మదురై కామరాజ్ యూనివర్సిటీ...

ఒకప్పుడు ఆ ప్రాంతంలోని మనుషులు ఎలా ఉండేవారో అర్థం చేసుకునేందుకు డిజిటల్‌గా ముఖాకృతులు తయారు చేసేందుకు తాము మోడల్‌గా తీసుకున్న రెండు పుర్రెల్లో.. ఒక పుర్రెకు చెందిన దంతాలు ఇవి అని మదురై కామరాజ్ యూనివర్సిటీ పరిశోధకులు చెప్పారు.
ఇద్దరు పురుషులకు చెందిన ఈ రెండు పుర్రెలను కీళడికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పురాతన స్మశాన వాటిక కొందగై నుంచి వెలికితీశారు.
ప్రస్తుతం ఈ పురావస్తు ప్రదేశం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
తమిళనాడులోని ఒక యూనివర్సిటీ ప్రయోగశాలలో 2500 ఏళ్ల నాటి దంతాల నుంచి ఎనామెల్‌ను (దంతాలపై ఉండే పొర) తొలగించేందుకు పరిశోధకులు ఒక చిన్న డ్రిల్‌ను ఉపయోగిస్తున్నారు.