‘భారత్ కో జానో క్విజ్ ‘లో మాంటిస్సోరి ఇండస్ పాఠశాల విజేత..!

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా స్థానిక కర్నూలు నగరంలో 'భారత్ వికాస్ పరిషత్' వారి ఆద్వర్యంలో విద్యార్థులకు 'భారత్ కో జానో క్విజ్ మరియు జాతీయ సాంస్కృతిక పోటీలు' నిర్వహించారు. ఈ పోటిలలో అనేక పాటశాలల విద్యార్ధులు పాల్గొన్నారు. భారత్ వికాస్ పరిషత్ అద్యక్షుడు మాట్లాడుతు, ఈ పోటీలలో అనేక మంది వివిధ పాఠశాలల విద్యార్థులు ఎంతో ఉత్సహంగా పాల్గొన్నారు అని తెలిపారు. ఇందులో హంద్రి విభాగం లో సీనియర్ కేటగిరీ క్విజ్ పోటీలో మాంటిస్సోరి ఇండస్ పాఠశాల విజేతలు గా నిలచగా, శ్రీ లక్ష్మి పాటశాల రన్నర్స్ గా నిలిచారు. అలాగే హంద్రి విభాగం లో జూనియర్ కేటగిరీ క్విజ్ పోటీలో శ్రీ లక్ష్మి పాటశాల విజేతలు గా నిలిచగా, మాంటిస్సోరి ఇండస్ స్కూల్ రన్నర్స్ గా నిలిచారు.ఈ కార్యక్రమంలో భారత్ వికాస్ పరిషత్ సభ్యులు , వివిధ పాఠశాలల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
భారత వికాస పరిషత్, కర్నూలు నందలి 2 శాఖల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడ భారత దేశ చరిత్ర మీద క్విజ్ మరియు దేశ భక్తి గీతాల పాటల పోటీలు " విజయ దుర్గ డిగ్రీ కాలేజి" నందు దిగ్విజయంగా జరిగినది. నగరం నందలి 38 పాఠశాలలు పాల్గొనగా క్విజ్ నందు జూనియర్ కేటగిరీ నందు ఆదిత్య విద్యాలయం, కల్లూరు & మంటిసోరి , విద్యానగర్ బ్రాంచీ విద్యార్థులు మరియు సీనియర్ కేటగిరీ నందు శ్రీ లక్ష్మీ హై స్కూలు, V.R.కాలనీ & మాంటిసోరి ఇండస్ పాఠశాలల విద్యార్థులు మొదటి బహుమతి పొందారు.
మరియు దేశభక్తి గీతాల పోటీల నందు శ్రీ వివేకానంద సంస్కృత పాఠశాల మరియు మాంటిసోరి A-క్యాంపు విద్యార్థులు మొదటి బహుమతి పొందినారు. ఈ కార్యక్రమంనకు అధ్యక్షులుగా శ్రీ పవన్, విజలెనస అధికారి మరియు కె.వి.సుబ్బారెడ్డి కాలేజి అధినేత శ్రీ డా సుబ్బారెడ్డి గారు విచ్చేసి విద్యార్థులకు మార్గ దర్శనం చేసినారు. ఈ కార్యక్రమం లో BVP యొక్క 2 శాఖల అధ్యక్ష, కార్యదర్శులు, కన్వీనర్లు మరియు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.